info@raviproduction.com

అరుణ అరెస్ట్, పోలీసు పెద్దలకు భయం

ఏపీ పోలీసు వర్గాల్లో శ్రీకాంత్–అరుణ వ్యవహారం భారీ సంచలనంగా మారింది. హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్‌కు సాధ్యం కాని పెరోల్‌ను నిడిగుంట అరుణ ప్రభావంతో మంజూరు చేయటం పెద్ద చర్చగా మారింది. జిల్లా ఎస్పీలు వ్యతిరేకించినా, హోంశాఖను ఒత్తిడి చేసి జూలై 30న పెరోల్ తెప్పించిందని ఆరోపణలు ఉన్నాయి. పెరోల్‌లో బయటకు వచ్చిన శ్రీకాంత్‌తో అరుణ సన్నిహిత వీడియోలు బయటపడటంతో వివాదం మరింత రగిలింది. దీంతో ప్రభుత్వం వెంటనే శ్రీకాంత్ పెరోల్‌ను రద్దు […]

సింగరేణి నుంచి కవిత ఔట్.

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు బీఆర్‌ఎస్‌లోని కుటుంబ విభేదాలే హాట్‌టాపిక్‌. మాజీ సీఎం కేసీఆర్ వారసత్వంపై కూతురు కవిత, కుమారుడు కేటీఆర్ మధ్య విభేదాలు బహిరంగంగా చర్చకు రావడం పెద్ద చర్చకు దారితీసింది. రాఖీ పండుగ రోజున కవిత తన అన్నకు రాఖీ కట్టాలని చెప్పినా, కేటీఆర్ “ఔట్ ఆఫ్ స్టేషన్” అన్నారని వచ్చిన వార్తలు ఈ వివాదానికి బలమిచ్చాయి. ఇదే కాకుండా కవితను సింగరేణి కార్మిక సంఘం గౌరవాధ్యక్ష పదవి నుంచి తప్పించి, ఆ బాధ్యతలను కేటీఆర్-మంత్రి […]

గుడ్ బై చెప్పేస్తున్న సమంత

టాలీవుడ్, కోలీవుడ్‌లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత రూత్ ప్రభు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. గౌతమ్ మీనన్ ‘ఏ మాయ చేశావే’తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన సమంత, ‘దూకుడు’, ‘ఈగ’, ‘అత్తారింటికి దారేది’, ‘రంగస్థలం’, ‘ఓ బేబీ’ వంటి హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా నిలిచారు. తమిళంలోనూ ‘తేరి’, ‘మెర్సల్’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందారు. వ్యక్తిగత జీవితంలో నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత, సమంత ఒంటరిగానే తన ప్రయాణాన్ని […]

వార్ 2 చూడాలని లేదు: నారా రోహిత్

నందమూరి – నారా కుటుంబాల మధ్య విభేదాలు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి. బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో కుటుంబం కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నా, ఆ వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లకు ఆహ్వానం అందకపోవడం చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో ఎన్టీఆర్ ‘వార్ 2’ ప్రమోషన్‌లో ఇచ్చిన స్పీచ్, టీడీపీ ఎమ్మెల్యే చేసిన విమర్శలు కూడా పెద్ద వివాదానికే దారితీశాయి. తాజాగా నారా రోహిత్ చేసిన కామెంట్స్ మరోసారి ఈ చర్చను రగిలించాయి. ఆయన మాట్లాడుతూ ‘కూలీ’ […]

మహేష్ బాబు కూతురు సితార వార్నింగ్

సూపర్ స్టార్ మహేశ్ బాబు కూతురు సితార ఘట్టమనేని తన పేరుతో సోషల్ మీడియాలో తిరుగుతున్న నకిలీ ఖాతాలపై స్పందించారు. తన శ్రేయోభిలాషులు, అభిమానులు మోసపోవద్దని హెచ్చరిస్తూ, అధికారిక ప్రకటన విడుదల చేశారు. సితార స్పష్టంగా తెలిపిందేమిటంటే – తాను కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే యాక్టివ్‌గా ఉంటాను, అక్కడికే తన అసలు ఖాతా పరిమితం అవుతుంది. వేరే ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోనూ తాను లేరని, కాబట్టి ఇతర నకిలీ ఖాతాలను నమ్మవద్దని సూచించింది. సితార ఇన్‌స్టాగ్రామ్‌లో […]

శ్రేయాస్ అయ్యర్ కోసం సోషల్ ఫైట్

భారత క్రికెట్‌లో ప్రతిభకు కొదవ లేదు. అలాంటి ప్రతిభావంతుల్లో శ్రేయస్ అయ్యర్ పేరు ముందుంటుంది. రంజీ నుంచి ఐపీఎల్ వరకు తన దూకుడు బ్యాటింగ్, చాకచక్యమైన కెప్టెన్సీతో గుర్తింపు తెచ్చుకున్నాడు. గత ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కి తీసుకెళ్లడం, ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన ఇవ్వడం అతని సామర్థ్యానికి నిదర్శనం. అయితే తాజాగా ఆసియా కప్ జట్టులో చోటు దక్కకపోవడం అభిమానులను నిరాశపరిచింది. క్రికెట్ విశ్లేషకులు కూడా అయ్యర్‌కి అన్యాయం జరిగిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో పంజాబ్ […]

2 కోట్ల కోసం ఎమ్మెల్యేకి వార్నింగ్ లేఖ

నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి వచ్చిన బెదిరింపు లేఖ కలకలం రేపుతోంది. ఆగస్ట్ 17న ఒక గుర్తు తెలియని వ్యక్తి ముఖానికి మాస్క్‌ వేసుకుని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఇంటికి వచ్చి, ఎమ్మెల్యేకు ఇవ్వాలని చెబుతూ భద్రతా సిబ్బందికి లేఖ అందించాడు. ఆ లేఖలో రూ.2 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని స్పష్టంగా రాయడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. వెంటనే ఈ విషయాన్ని ఎంపీ, ఎమ్మెల్యేకు తెలియజేయగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను […]

నిమ్మగింజలు తింటున్నారా? అయితే!

నిమ్మకాయల్లో విటమిన్ C, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. చాలా మంది నిమ్మకాయలోని గింజలను పారేస్తారు కానీ వాటిలో కూడా శరీరానికి ఉపయోగపడే పోషకాలు ఉన్నాయి. నిమ్మ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, ఫైబర్ ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్‌ నుంచి రక్షణ లభిస్తుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడటానికి, మలబద్ధకం తగ్గడానికి సహాయపడతాయి. అలాగే చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో, క్యాన్సర్ ప్రమాదాన్ని […]

జగన్, జూనియర్ ఎన్టీఆర్ కలుస్తారా?

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు – సినిమాలు ఒకదానికొకటి రిలేషన్ ఉంటుందని తెలుసు. ఇదే చర్చ మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పేరును రాజకీయాల్లోకి లాగడం పెద్ద సంచలనం రేపుతోంది. అనంతపురం ఎమ్మెల్యే చేసిన కామెంట్స్‌పై జూనియర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు కూడా చేశారు. ఇక వైసీపీ మాత్రం జూనియర్‌కు మద్దతుగా నిలుస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరక్ చేశారు. జగన్–జూనియర్ త్వరలో కలుసుకుంటారని కొన్ని పుకార్లు గుప్పుమంటున్నాయి. అయితే రాజకీయ […]

విశాఖ ఉక్కు ఉద్యమం ~ వైసిపి హక్కు?

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రయత్నాలు మరోసారి పెద్ద చర్చకు దారి తీశాయి. ఇప్పటికే రెండు ఏళ్లకు పైగా ఉద్యోగులు, కార్మికులు నిరసనలు కొనసాగిస్తుండగా, తాజాగా యాజమాన్యం 34 విభాగాలను ప్రైవేటీకరించే నోటిఫికేషన్ జారీ చేయడం ఆగ్రహానికి కారణమైంది. దీనిపై ఉద్యోగ సంఘాలు తీవ్రంగా స్పందించాయి. గతంలో కాంగ్రెస్ మద్దతు తెలుపగా, ఇప్పుడు వైసీపీ కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని మాజీ ఎంపీ ప్రకటన చేశారు. ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతం కాకుండా పార్టీ తరఫుననే అన్నట్లు […]