విశాఖ ఉక్కు ఉద్యమం ~ వైసిపి హక్కు?

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రయత్నాలు మరోసారి పెద్ద చర్చకు దారి తీశాయి. ఇప్పటికే రెండు ఏళ్లకు పైగా ఉద్యోగులు, కార్మికులు నిరసనలు కొనసాగిస్తుండగా, తాజాగా యాజమాన్యం 34 విభాగాలను ప్రైవేటీకరించే నోటిఫికేషన్ జారీ చేయడం ఆగ్రహానికి కారణమైంది. దీనిపై ఉద్యోగ సంఘాలు తీవ్రంగా స్పందించాయి. గతంలో కాంగ్రెస్ మద్దతు తెలుపగా, ఇప్పుడు వైసీపీ కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని మాజీ ఎంపీ ప్రకటన చేశారు. ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతం కాకుండా పార్టీ తరఫుననే అన్నట్లు చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జగన్ ప్రభుత్వంలోనే ప్రైవేటీకరణకు అడుగులు పడగా, అప్పట్లో వ్యతిరేకించిన వైసీపీ ఇప్పుడు ఉద్యమానికి మద్దతు తెలపడం వెనుక రాజకీయ లాభాలే ఉన్నాయంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు విశాఖ ఉక్కును వైసీపీ రాజకీయ అజెండాగా ఉపయోగించుకుంటుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఉద్యోగుల భవిష్యత్తు, ప్లాంట్ నిలకడే కాకుండా, ఈ అంశం రాజకీయ పార్టీల వ్యూహాలకు కూడా పరీక్షగా నిలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *