ఏపీ పోలీసు వర్గాల్లో శ్రీకాంత్–అరుణ వ్యవహారం భారీ సంచలనంగా మారింది. హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్‌కు సాధ్యం కాని పెరోల్‌ను నిడిగుంట అరుణ ప్రభావంతో మంజూరు చేయటం పెద్ద చర్చగా మారింది. జిల్లా ఎస్పీలు వ్యతిరేకించినా, హోంశాఖను ఒత్తిడి చేసి జూలై 30న పెరోల్ తెప్పించిందని ఆరోపణలు ఉన్నాయి. పెరోల్‌లో బయటకు వచ్చిన శ్రీకాంత్‌తో అరుణ సన్నిహిత వీడియోలు బయటపడటంతో వివాదం మరింత రగిలింది. దీంతో ప్రభుత్వం వెంటనే శ్రీకాంత్ పెరోల్‌ను రద్దు చేసి, అరుణను అరెస్ట్ చేసింది.
అరుణ గూడూరు ప్రాంతానికి చెందినవారు. ఖైదీల కోసం ఎన్జీవో నడుపుతూ, గతంలో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసింది. ఆమె శ్రీకాంత్ ప్రియురాలా? లేక భార్యా? అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. పెరోల్ కోసం 12 లక్షల ఖర్చు చేశానని స్వయంగా చెప్పుకోవడం కూడా సంచలనం రేపింది. ఇదే సమయంలో ఆమె కారు డిక్కీలో కూర్చొని తీసిన వీడియో, పెరోల్ రద్దు తర్వాత పెట్టిన భావోద్వేగ పోస్టులు వైరల్ అవుతున్నాయి. పెరోల్ జీవో రద్దు చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. అరుణ నోరు విప్పితే పెద్ద పెద్ద నాయకులు బహిర్గతం అవుతారనే చర్చ కూడా జరుగుతోంది. ప్రస్తుతం ఆమె బ్యాక్‌గ్రౌండ్, పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న లింకులు ఏపీలో హాట్ టాపిక్‌గా మారాయి.

