info@raviproduction.com

దేశంలో ధనిక వినాయకుడు రికార్డ్

దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముంబైలోని కింగ్స్ సర్కిల్ GSB సేవా మండలి ఆద్వర్యంలో గణపతి మండపం దేశంలోనే అత్యంత ధనికమైనదిగా పేరు తెచ్చుకుంది. ఈసారి ఆ మండపానికి 474.46 కోట్ల విలువైన ఇన్సూరెన్స్ తీసుకోవడం విశేషం. గత ఏడాది 400 కోట్లతో రికార్డు సృష్టించగా, ఈసారి దానిని మించి ఇన్సూరెన్స్ కవరేజ్ పొందింది. ఇందులో బంగారం, వెండి ఆభరణాలకు 67 కోట్ల ఆల్ రిస్క్ పాలసీ.. ఉండగా, వాలంటీర్స్, పూజారులు, సెక్యూరిటీ, పార్కింగ్ […]

అన్నది చేసి చూపించిన జగన్

ఇప్పటివరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీడియా వార్తల్లో నిత్యం నిలుస్తూనే ఉన్నారు. ఇటీవల టీడీపీ, జగన్ తిరుపతికి వెళ్లి గణపతి పూజలో డిక్లరేషన్ ఇవ్వాల్సిందని ప్రచారం ప్రారంభించగా, వైసీపీ ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి దీన్ని ఫేక్ ప్రచారం అని తేల్చేశారు. టీడీపీ చేసిన విమర్శలు ఫలితం ఇవ్వలేదని నిరూపితమైంది. దీంతో జగన్ counter గా, గణేష్ పూజలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. అయితే విజయవాడలో కురిసిన భారీ వర్షం కారణంగా నగరంలో పూజ నిర్వహించడం అసాధ్యం […]

షారుక్ ఖాన్, దీపికా పదుకొనెల పై చీటింగ్ కేస్‌

రాజస్థాన్‌లో షారుక్ ఖాన్, దీపికా పదుకొనెల పై హ్యుండాయ్ కార్ల ప్రకటనకు సంబంధించి చీటింగ్ కేస్‌లో ఇరుక్కున్నారు. భరత్‌పూర్ జిల్లా నివాసి కీర్తి సింగ్‌ ఈ ఇద్దరి ప్రమోషనల్ ప్రకటన చూసి 24 లక్షల విలువైన హ్యుండాయ్ అల్కాజర్ కారును కొన్నప్పటికీ, ఆరు నెలల్లో ఇంజిన్‌లో టెక్నాలజీ సమస్యలు రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. షోరూం సిబ్బంది కూడా మోడల్‌లో డిజైన్ సమస్యలున్నాయి, సరి చేయలేమంటూ సరిగ్గా పట్టించుకోలేదని కోర్టులో చెప్పారు. మొదట పోలీసులు experts రిపోర్ట్ […]

జగన్, కెసిఆర్ లకు రాహుల్ ఫోన్?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచిన ఇద్దరు ముఖ్య నాయకులు జగన్, కేసీఆర్. గాంధీలను ఎదిరించి జగన్ సొంత పార్టీ పెట్టి ఏపీలో కాంగ్రెస్‌ను పూర్తిగా మాయం చేశారు. మరోవైపు తెలంగాణా రాష్ట్రం సాధనలో కాంగ్రెస్ సహకారం ఉన్నా, కేసీఆర్ చివరికి టీఆర్ఎస్ ద్వారానే సీఎం అయ్యి, కాంగ్రెస్‌ను దశాబ్దం పాటు అధికారానికి దూరం చేశారు. ఈ ఇద్దరే కాంగ్రెస్‌కు పెద్ద కష్టాలు కలిగించారని పార్టీ భావిస్తోంది.ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి వ్యూహాత్మకంగా తెలుగు వాడైన […]

బిజెపికి దాసుడు జగన్: రామకృష్ణ

ఉప రాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో వైఎస్ జగన్ వైఖరిపై కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికే పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అక్రమ పొత్తు అంటూ జగన్‌ను తప్పుబట్టగా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా కఠిన వ్యాఖ్యలు చేశారు. జగన్ బీజేపీకి దాసుడుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రంలో బీజేపీ తెచ్చిన ప్రతి బిల్లుకూ వైసీపీ మద్దతు ఇస్తుందని, కేసుల కారణంగానే ఈ విధంగా దాసోహం అంటున్నారేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. […]

పవన్ గిఫ్ట్, వదిన అందజేత

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనను గెలిపించిన పిఠాపురం మహిళలకు శ్రావణ మాసం చివరి శుక్రవారం ప్రత్యేక కానుకగా 10 వేల చీరలు పంపించారు. ఈ సందర్భంగా స్థానిక పాదగయ క్షేత్రంలో 10 వేల మహిళలతో ఐదు విడతలుగా సామూహిక వరలక్ష్మీవ్రతం నిర్వహించారు. ప్రతి విడతలో 2000 మంది మహిళలు పాల్గొని భక్తిశ్రద్ధలతో వ్రతం ఆచరించారు. ముందుగానే టోకెన్లు పంపిణీ చేయడంతో ఎలాంటి తోపులాటలు లేకుండా కార్యక్రమం శాంతంగా సాగింది. జనసేన నాయకుడు నాగబాబు సతీమణి […]

జగన్ పై షర్మిల హాట్ కామెంట్స్

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు వైసీపీ మద్దతు పలకడాన్ని ఆమె ఆక్షేపిస్తూ.. వైసీపీ అసలు రంగు మరోసారి బయటపడింది, జగన్ బీజేపీ B-T లా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు. ప్రధాని మోదీకి జగన్ దత్తపుత్రుడని ఆరోపించిన షర్మిల.. టీడీపీ, జనసేన, వైసీపీ మూడు కలిసి బీజేపీకి తోడుగా పనిచేస్తున్నాయని వ్యాఖ్యానించారు. బాబు, జగన్, పవన్.. […]

జైలుకెళ్తే ఊస్టింగే: మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ అవినీతి పట్ల కఠినమైన వైఖరి ఎత్తుకున్నారు. జైలుకి వెళ్ళే వారు ఇకపై పదవుల్లో కొనసాగలేరని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు జైలుకి వెళ్ళగానే 50 గంటల్లో ఉద్యోగం ఆటోమేటిక్‌గా పోతుందని చెప్పారు. అలాంటప్పుడు రాజకీయ నాయకులు జైలు నుంచి పాలించడమెలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. అందుకే 130వ రాజ్యాంగ సవరణ బిల్లుతో అవినీతి రహిత పాలనకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ చట్టం ప్రధానుల నుంచి మంత్రుల వరకు అందరికీ వర్తిస్తుందని […]

బాబోయ్ చంద్రబాబు.

టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పీ–4 కార్యక్రమంపై తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారాయి. ధనవంతులు పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిస్తున్నారు. తాను స్వయంగా 250 కుటుంబాలను దత్తత తీసుకున్నానని ప్రకటించారు కూడా. అయితే, ఈ నిర్ణయం స్థానికంగా ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఒత్తిడిగా మారుతోంది. ఎందుకంటే పార్టీ నేతల్లో చాలామంది ఆర్థికంగా చాలా బలంగా ఉన్నా, ఇప్పటివరకు ఈ కార్యక్రమంలో ముందుకు రావడం లేదు. సోషల్ మీడియాలో, మీడియాలో వస్తున్న వార్తలు వారిని […]

విపరీతమైన కాళ్ళ వాపులా?

కాళ్ల వాపు సూచించే మూత్రపిండ సమస్యలపై జాగ్రత్తలు తీసుకోండి.ఆరోగ్యం మహాభాగ్యం. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD) భారతదేశంలో పెద్ద సమస్యగా మారుతోంది. ఈ వ్యాధి లక్షణాల్లో ముఖ్యమైనది కాళ్ల వాపు. శరీరంలో ద్రవం నిలిచిపోయినప్పుడు, ముఖ్యంగా మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవడం వల్ల, కాళ్లు, పాదాల్లో వాపులు వచ్చే అవస్థ ఎడిమా అని పిలవబడుతుంది. మధుమేహం, రక్తపోటు, మారిన జీవనశైలి కారణంగా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. చాలా మందికి ఈ వ్యాధి ఉన్నట్లు ముందే తెలియదు, కాళ్ల […]