తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు – సినిమాలు ఒకదానికొకటి రిలేషన్ ఉంటుందని తెలుసు. ఇదే చర్చ మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పేరును రాజకీయాల్లోకి లాగడం పెద్ద సంచలనం రేపుతోంది. అనంతపురం ఎమ్మెల్యే చేసిన కామెంట్స్‌పై జూనియర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు కూడా చేశారు. ఇక వైసీపీ మాత్రం జూనియర్‌కు మద్దతుగా నిలుస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరక్ చేశారు. జగన్–జూనియర్ త్వరలో కలుసుకుంటారని కొన్ని పుకార్లు గుప్పుమంటున్నాయి. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం జూనియర్ ఇంకా పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టారు, ఆయన వైసీపీతో కలిసే అవకాశం లేదని అంటున్నారు. తాత నందమూరి ఎన్టీఆర్ తరపున టీడీపీ అనేది సహజమైన మార్గం అని భావిస్తున్నారు. అవసరమైతే భవిష్యత్తులో కొత్త పార్టీ పెట్టే ఛాన్స్ ఉన్నా, ఇవన్నీ ఇప్పుడే చెప్పలేని విషయాలేనని చెబుతున్నారు. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ సోషల్ మీడియా క్రియేట్ చేస్తున్న రాజకీయ హంగామా అసలు విషయానికి దూరంగా ఉందని, ప్రస్తుతం ఆయనకు రాజకీయ ప్రవేశం చాలా దూరంలో ఉందని స్పష్టమవుతోంది.

