వార్ 2 చూడాలని లేదు: నారా రోహిత్

నందమూరి – నారా కుటుంబాల మధ్య విభేదాలు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి. బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో కుటుంబం కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నా, ఆ వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లకు ఆహ్వానం అందకపోవడం చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో ఎన్టీఆర్ ‘వార్ 2’ ప్రమోషన్‌లో ఇచ్చిన స్పీచ్, టీడీపీ ఎమ్మెల్యే చేసిన విమర్శలు కూడా పెద్ద వివాదానికే దారితీశాయి. తాజాగా నారా రోహిత్ చేసిన కామెంట్స్ మరోసారి ఈ చర్చను రగిలించాయి. ఆయన మాట్లాడుతూ ‘కూలీ’ సినిమా ఓకే అనిపించిందని, అందులో కొన్ని బ్లాక్స్ బాగున్నాయని చెప్పాడు. కానీ ఎన్టీఆర్ నటించిన ‘వార్ 2’ను తాను చూడలేదని, చూడాలనే ఆసక్తి కూడా లేదని స్పష్టం చేశాడు. తన స్నేహితులు ఏ సినిమా చూడాలి అని అడిగితే, ‘కూలీ’నే చూడమని చెప్పానని వెల్లడించాడు. సాధారణంగా చెప్పిన మాట అయినా, నెటిజన్లు దీనిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *