info@raviproduction.com

జరిగితే ఏపీ దశ మారినట్టే!

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రతన్ టాటా సంస్థల సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా ఇన్నోవేషన్ హబ్బులు ప్రారంభమయ్యాయి. అమరావతి సహా ఐదు ప్రధాన నగరాల్లో మొదలైన ఈ కేంద్రాలు, యువతకు ఉపాధి కల్పించడం, కొత్త పారిశ్రామికవేత్తలను తయారు చేయడం, స్థానిక ఉత్పత్తులకు మార్కెట్ కల్పించడం లక్ష్యంగా ఏర్పడ్డాయి. రాబోయే ఐదేళ్లలో లక్ష మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. దేశంలోనే తొలిసారిగా రతన్ టాటా వంటి విశ్వసనీయ సంస్థ ఈ బాధ్యతను […]

తీవ్ర వత్తిడిలో వైసిపి, బిఆర్ఎస్

దేశంలో ఉప రాష్ట్రపతి ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఇప్పటి వరకు ఎనిమిది దశాబ్దాల చరిత్రలో కేవలం నాలుగు సార్లే ఉప రాష్ట్రపతి ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. మిగతా అన్ని సార్లు పోటీ తప్పలేదు. ఈసారి కూడా ఎన్డీయే – ఇండియా కూటముల మధ్య పోరు తలెత్తింది. ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాక్రిష్ణన్ కాగా, ఇండియా కూటమి నుంచి తెలుగు వాసి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన రాజకీయాలకు అతీతుడు, న్యాయ కోవిదుడు, బలమైన […]

వైయస్ జగన్ ఇంటికి షర్మిల.. ఇదేంది

మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబ రాజకీయాలు మళ్లీ హాట్‌టాపిక్‌గా మారాయి. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థి రిటైర్డ్ జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి మద్దతు కోసం కాంగ్రెస్ హైకమాండ్ అన్ని రాష్ట్ర పీసీసీ చీఫ్‌లను రంగంలోకి దింపగా, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా చురుకుగా పనిచేస్తున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టిన ఆమె, తన అన్న జగన్‌ను కూడా అపాయింట్మెంట్ కోరనున్నట్లు ప్రచారం ఉంది. […]

నాన్నతో పని చేయడం కష్టం: లోకేష్

మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజనరీ లీడర్ అయిన సీఎం చంద్రబాబుతో పనిచేయడం నిజంగా కష్టమని, ఆయన ఇచ్చిన ఫైల్ పురోగతి 15 నిమిషాల్లోనే అడిగేస్తారని చెప్పారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు, తన క్రమశిక్షణతో మంత్రులు, ఎమ్మెల్యేలను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు వేగంగా పనిచేయిస్తారని లోకేశ్ వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్‌ నిర్మించిన చంద్రబాబు, ఇప్పుడు అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతున్నారని ఆయన అన్నారు. […]

చీరలే కాదు సిక్కోలు పోలిటిక్స్ మడతేస్తా

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మరోసారి సామాజిక ఆధిపత్యం, రాజకీయ ఆధిపత్యం పోరు వేడెక్కుతోంది. జిల్లాలో బీసీలకే పెత్తనం ఉన్నా, ఆ వర్గాల్లోనే గట్టి తగాదాలు కనిపిస్తున్నాయి. తాజాగా వైసీపీ నుంచి సస్పెండ్ అయిన దువ్వాడ శ్రీనివాస్ మళ్లీ రంగంలోకి వచ్చారు. చీరల వ్యాపారంలో బిజీగా ఉన్న ఆయన, ఇప్పుడు ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు అనూహ్యంగా అండగా నిలిచారు. కూనపై జరుగుతున్న వివాదాల వెనక టీడీపీలో అచ్చెన్నాయుడు, వైసీపీలో ధర్మాన కృష్ణదాస్ ఉన్నారని దువ్వాడ ఆరోపించారు. […]

యానాం ONGC గ్యాస్ లీక్, భయం భయం

యానాం సమీపంలో ఓఎన్‌జీసీ గ్యాస్ పైప్‌లైన్ ఒక్కసారిగా లీక్ కావడంతో భారీ మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురై వెంటనే అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన అధికారులు సముద్రంలోనే గ్యాస్ సరఫరాను నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. అయితే తరచుగా జరుగుతున్న గ్యాస్ లీకేజీలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, చమురు సంస్థలు తరచూ తనిఖీలు నిర్వహించి భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ […]

పరదా మూవీకి సరికొత్త రివ్యూ

తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభవం ఇచ్చే పరదా సినిమా ఈ ఆగస్టు 22న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కథ ఒక గ్రామీణ ప్రాంతంలో మూఢనమ్మకాల వల్ల మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల చుట్టూ తిరుగుతుంది. సుబ్బలక్ష్మీ పాత్రలో అనుపమ పరమేశ్వరన్, సంగీత, దర్శన రాజేంద్రన్.. ఆకట్టుకునే నటనతో ఈ కథకు మరింత జీవం పోశారు. కథలో మహిళ తన హక్కుల కోసం, సమాజపు నిష్ఠూరమైన భావాలపై పోరాడడం స్పష్టంగా చూపించబడింది. ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్‌గా, ఆడియో విజువల్ […]

విశ్వంభర గ్లింప్స్ గూస్‌బంప్స్ అంతే

మెగా సూపర్ స్పెషల్.. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన పండుగ సందర్భంగా విడుదలైన విశ్వంభర గ్లింప్స్ ఫ్యాన్స్ మనసులను అలా అలా గాల్లోకి ఎగిరేలా అద్భుతంగా చేశారు. దర్శకుడు వశిష్ట క్రియేట్ చేసిన ఈ సొషియో ఫాంటసీ సినిమాలో, ఒక చిన్న పిల్లవాడికి, ముసలివాడికి మధ్య జరిగిన మాటల్లో ప్రపంచంలోని స్వార్థం, వినాశనం, అసహనం చూపిస్తూ, కష్ట సమయాల్లో రక్షకుడిగా చిరంజీవి ఎంట్రీ చూపించారు. ఒక్కసారే గూస్‌బంప్స్ బాబోయ్.. అదిరిపోయింది‌. ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ రూపొందించిన విశ్వంభర […]

విడుదల రజని చుట్టూ రాజకీయం

చిలకలూరిపేట వైసీపీ ఇన్‌చార్జ్‌గా మాజీ మంత్రి విడుదల రజనిని తిరిగి నియమించడం పార్టీ లోపల పెద్ద చర్చకు దారి తీసింది. రజనీపై స్థానికంగా వ్యతిరేక వర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆమె కారణంగానే నాయకులు, కార్యకర్తలు దూరమయ్యారని, కేసులు పడిన వారు ఇంకా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తున్నారు. 2019లో ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి పదవిలో ఉండగా తాను విభేదించిన వారిని కక్ష పెట్టి వ్యవహరించారని విమర్శలు వినిపిస్తున్నాయి. 2024లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి […]

కాస్ట్లీ కలలు అవసరమా చంద్రబాబు గారూ..

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్న వేళ సీఎం చంద్రబాబు మళ్లీ ఉచిత ఇళ్ల ప్రకటనతో చర్చనీయాంశమయ్యారు. గత పాలనలో చేసిన తప్పులు మళ్లీ పునరావృతమవుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల హామీల అమలే ప్రభుత్వానికి పెద్ద భారమై ఉన్న సమయంలో, మరోసారి లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పటం అధికారులు ఆందోళన చెందేలా చేస్తోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి 10 లక్షల ఇళ్లు, ఇందులో వచ్చే నెలలోనే 3 లక్షల ఇళ్లు, సంక్రాంతికి మరో […]