నిమ్మగింజలు తింటున్నారా? అయితే!

నిమ్మకాయల్లో విటమిన్ C, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. చాలా మంది నిమ్మకాయలోని గింజలను పారేస్తారు కానీ వాటిలో కూడా శరీరానికి ఉపయోగపడే పోషకాలు ఉన్నాయి. నిమ్మ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, ఫైబర్ ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్‌ నుంచి రక్షణ లభిస్తుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడటానికి, మలబద్ధకం తగ్గడానికి సహాయపడతాయి. అలాగే చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో, మూత్రపిండ రాళ్లను నివారించడంలో, ఐరన్ శోషణకు దోహదపడతాయి. కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బరువు తగ్గటానికి కూడా ఉపయోగపడతాయి. అయితే నిమ్మ గింజలను అధికంగా కాకుండా మితంగా తీసుకోవాలి. మొత్తానికి నిమ్మకాయలోనూ, నిమ్మ గింజల్లోనూ ఆరోగ్యాన్ని కాపాడే అద్భుత గుణాలు దాగి ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *