info@raviproduction.com

కేటీఆర్ గజనీలా మరిపోయారా?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడే తీరు ఇప్పుడు పొలిటికల్ హీట్ కి దారితీస్తోంది. ఆయన మాటలతోనే పార్టీకి నష్టం జరుగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ చేసిన కామెంట్స్ కి, నిజానికి రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాలకి సరిపోలడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.రేవంత్ కాలేజీల సమ్మెలకు త్వరగా పరిష్కారం చూపడం, విద్యార్థులతో నేరుగా మాట్లాడేందుకు సిద్ధం కావడం వంటి చర్యలు నియంత పాలన కాదని అంటున్నారు. కేసీఆర్ హయాంలో జరిగిన ఆర్టీసీ […]

వైసీపీ లో కొత్త సీన్ – జగన్ కి భయమా?

వైసీపీలో భయం ఎవరికి లేదని నాయకులు చెబుతున్నా, ప్రస్తుతం పరిస్థితులు రివర్స్‌గా ఉన్నట్లు టాక్. గ్రౌండ్ లెవెల్‌లో క్యాడర్ మాత్రం గట్టిగానే నిలబడుతూ, ఓటమి నుంచే గెలుపు అందుకోవాలని చూస్తున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు జగన్ ఆలోచనల్లో మార్పు తెచ్చినట్లు చెబుతున్నారు. టీడీపీ కూటమి ఎన్నికలు జరగనీయకుండా అడ్డుకోవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.కుప్పం ఎన్నికల తరువాతే వై నాట్ 175 స్లోగన్ పుట్టింది కానీ, 2024 ఫలితాల తరువాత అది […]

వద్దు అన్న మండలి ఇప్పుడు ముద్దు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో శాసనమండలి అంశం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. 2021లో మూడు రాజధానుల బిల్లుపై మండలి అడ్డంకిగా మారిందని ఆగ్రహంతో వైసీపీ ప్రభుత్వం రద్దు తీర్మానం చేసింది. అప్పట్లో సీఎం జగన్ మండలి అవసరం లేదని, అది ప్రజా ప్రభుత్వాలకు అడ్డంకి అవుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.అయితే కేంద్రం వద్ద ఆ బిల్లు పెండింగ్‌లో పడటంతో రద్దు ప్రక్రియ ఆగిపోయింది. తర్వాత వైసీపీకి మండలిలో మెజారిటీ పెరగడంతో ఆ విషయం క్రమంగా చర్చలోనుండి మాయం అయింది. […]

వైసిపి ఎమ్మెల్యేలకు తోడుగా కూటమి!

రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి మొదలయ్యాయి. కానీ మొత్తం కూటమి ఎమ్మెల్యేలు 164 మంది ఉంటే హాజరైన వారు కేవలం 45 మంది మాత్రమే. అంటే నాలుగవ వంతు కూడా రాలేదు. దీంతో సభలో ఖాళీ సీట్లు కనిపించాయి.స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇప్పటికే పలుమార్లు సభ్యులు సభకు రావాలని కోరినా పరిస్థితి మారలేదు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు సభ వేదిక అని ఆయన గుర్తుచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యేలు […]

GST పై పొగడ్తలు, కానీ నిజమేది?

దేశవ్యాప్తంగా జీఎస్టీ స్లాబ్స్ తగ్గించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను బీజేపీ నేతలతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు కూడా ఆకాశానికెత్తేస్తున్నారు. దీపావళి కానుకలా ఈ నిర్ణయం పేదలు, మధ్యతరగతి వర్గాలకు మేలు చేస్తుందని చెబుతున్నారు.అయితే అసలు జీఎస్టీని కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిందని, అప్పట్లో 5%, 12%, 14% మాత్రమే స్లాబ్స్ ఉన్నాయని అంటున్నారు. 2014 తర్వాత మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టి 18%, 24% స్లాబ్స్ జోడించింది. […]

అక్కడ మూవీ చూస్తే మరణశిక్షే

దేశమంటే మట్టి కాదు, మనుషులు అన్న గురజాడ సూక్తి గుర్తుకు వచ్చేలా ఉత్తర కొరియాలో ప్రజల జీవితం నరకంగా మారింది. ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక ప్రకారం అక్కడ ప్రజలకు స్వేచ్ఛలేదు. విదేశీ సినిమాలు, సీరియల్స్ చూడటం లేదా షేర్ చేయడం కూడా మరణశిక్షే. 2015 నుంచి ఆరు కొత్త చట్టాలంటూ.. చిన్నచిన్న తప్పులకే కఠిన శిక్షలు విధిస్తున్నారని రిపోర్ట్ తెలిపింది.ఆ దేశం నుంచి తప్పించుకున్న పలువురు చెబుతున్న వివరాల ప్రకారం ఆకలి కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రోజుకు […]

కెటిఆర్ ట్వీట్, జగన్ కి అవమానం

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్‌తో ఏపీ రాజకీయాల్లో చర్చ మొదలైంది. మహబూబ్‌నగర్ దగ్గర అమరరాజా EV బ్యాటరీ యూనిట్ నిర్మాణం పూర్తవుతున్న ఫొటోలను కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ, తాము అధికారంలో ఉన్నప్పుడే ఈ పరిశ్రమను తీసుకువచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఇందులో పొలిటికల్ కామెంట్స్ లేకపోయినా, ఆంధ్రప్రదేశ్‌లో ఇది వైసీపీ అధినేత జగన్‌కు పెద్ద ఇబ్బంది కలిగించిందని విశ్లేషకులు అంటున్నారు.అమరరాజా యజమాని గల్లా జయదేవ్ తెలుగుదేశం నేత […]

లైంగికదాడిలో నాలుక‌ కొరికిన మహిళ

లైంగిక దాడి టైమ్‌లో ఆత్మరక్షణ కోసం దుండగుడి నాలుకను కొరికినందుకు శిక్షపడిన మహిళకు ఇప్పుడు నిర్దోషిగా తీర్పు వచ్చింది.1963లో ఈ సంఘటన జరిగే సమయంలో చోయ్ మాల్-జాకు 18 ఏళ్లు మాత్రమే. ఆమెను లైంగికదాడి చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి నుండి తప్పించుకోవడానికి నాలుకను కొరికి పరారయ్యారు. అయితే అప్పట్లో కోర్టు దీనిని ఆత్మరక్షణగా గుర్తించకుండా ఆమెకు 10 నెలల జైలు శిక్ష వేసింది. దాడి చేసిన వ్యక్తికి మాత్రం కేవలం 6 నెలల శిక్షే పడింది, అది […]

ట్రంప్ టారిఫ్ వల్ల ఏపీకి నష్టం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ టారిఫ్ దెబ్బతో ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామన్న కారణంతో భారత్‌పై అమెరికా మొదట 25%, తర్వాత 50% వరకు సుంకాలు విధించింది. దీంతో ఏపీ నుంచి అమెరికాకు వెళ్లే రొయ్యల ఎగుమతులు ఒక్కసారిగా ఆగిపోయాయి. దాదాపు 25 వేల కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. కంటెయినర్లలో సిద్ధంగా ఉన్న సరుకుపైనే 600 కోట్ల భారమొచ్చింది. గోదావరి జిల్లాలు, […]

వైసీపీ లో డబుల్ గేమ్ నేతల ప్రక్షాళన

2024 ఎన్నికల ఓటమి తరువాత వైసీపీలో యాక్టివ్ నెస్ తగ్గిపోయింది. పార్టీ చేసిన ఆందోళనలు పెద్దగా జనాల్లోకి వెళ్లకపోవడంతో అధినాయకత్వం ఆందోళన చెందుతోంది. ఎవరు యాక్టివ్ గా ఉన్నారు, ఎవరు సైలెంట్ గా ఉన్నారన్న లిస్ట్ జగన్ చేతుల్లోకి చేరింది. ఆ లెక్కల ప్రకారం చిన్న పెద్ద నేతలు వందమందికి పైగా కీలక నాయకులు పూర్తిగా మౌనంగా ఉన్నట్లు తేలింది.దీనిపై జగన్ తీవ్ర హెచ్చరికలు చేస్తున్నట్లు సమాచారం. పార్టీలో ఉంటూ పనిచేయని నేతలకు స్థానం ఉండదని, అవసరం […]