info@raviproduction.com

బతికున్నవారిని చూసుకోండి: సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు ప్రభుత్వాల వృథా ఖర్చులపై స్ట్రాంగ్ కామెంట్స్ చేసింది… ముందు బతికున్నవారిని చూసుకోండి, తర్వాత చనిపోయినవారికి విగ్రహాలు పెట్టండని స్పష్టంగా చెప్పింది. ప్రజల పన్నుల రూపంలో వచ్చే డబ్బు ప్రజల సంక్షేమం కోసం మాత్రమే ఖర్చు చేయాలని హెచ్చరించింది.విద్య, ఆరోగ్యం, ఉపాధి, ఆహారం వంటి ప్రాథమిక అవసరాలు తీరకపోతే, కోట్ల రూపాయలు విగ్రహాల నిర్మాణాలకు ఖర్చు చేయడం నైతికంగా సరైంది కాదని కోర్టు చెప్పింది. చాలాసార్లు విగ్రహాల ప్రాజెక్టులు రాజకీయ ప్రయోజనాల కోసమే జరుగుతున్నాయని కూడా వ్యాఖ్యానించింది.తమిళనాడులో […]

నిరూపిస్తే ఇప్పుడే రాజీనామా చేస్తా!

రాష్ట్ర శాసనమండలిలో మంగళవారం నాడు.. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటు అంశంపై అధికార–ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. విశాఖలో ఉర్సా కంపెనీకి ఎకరా భూమి ఒక్క రూపాయికే ఇచ్చారని బొత్స సత్యనారాయణ ప్రశ్నించగా, మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. తాను అలాంటి మాట ఎప్పుడూ చెప్పలేదని, నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. టీసీఎస్, కాగ్నిజెంట్ కంపెనీలకే ఒక్క రూపాయికి భూములు ఇచ్చామని, ఉర్సాకు మాత్రం ఇవ్వలేదని లోకేష్ […]

టెక్సాస్‌లో హనుమాన్ విగ్రహంపై కామెంట్స్

టెక్సాస్ రాష్ట్రం షుగర్‌ల్యాండ్‌లోని అష్టలక్ష్మి ఆలయంలో ఇటీవల 90 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇది ఉత్తర అమెరికాలోని అతి ఎత్తైన హిందూ దేవుని విగ్రహంగా గుర్తింపు పొందింది.కానీ టెక్సాస్ రిపబ్లికన్ పార్టీ నేత అలెగ్జాండర్ డంకన్ సోషల్ మీడియాలో ఈ విగ్రహాన్ని కల్పించబడిన హిందూ దేవుడంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు. అమెరికా క్రైస్తవ దేశమని, అక్కడ ఇలాంటి విగ్రహం ఎందుకు ప్రతిష్టించారంటూ ప్రశ్నించారు. భూమిపై గానీ, ఆకాశంలో గానీ ఏ విగ్రహాన్ని పూజించకూడదని బైబిల్‌లోని […]

వైసీపీ 2.0 కోసం గట్టిప్లాన్ చేసిన జగన్

గత ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొన్న వైసీపీని బలోపేతం చేయడానికి పార్టీ అధినేత జగన్ సరైన ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అధికారంలో ఉండగా పార్టీ కార్యకలాపాలను వెనక్కి వేశారని, వాలంటీర్ వ్యవస్థ ద్వారా కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల అసంతృప్తి ఏర్పడిందని జగన్ గుర్తించినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో పార్టీని గ్రామస్థాయి నుంచి పైస్థాయి వరకు బలోపేతం చేయాలనే నిర్ణయం తీసుకున్న జగన్, కొత్త కమిటీలను నియమించి, కార్యాకర్తల అభిప్రాయాన్ని తీసుకొని పదవులు కేటాయించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అదేవిధంగా, […]

ప్రజల గొంతును వినిపించిన నాగబాబు

జనసేన ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు మంగళవారం శాసనమండలిలో తొలిసారి ప్రసంగం చేసి, తన ధైర్యాన్ని చాటుకున్నారు. ఎన్నికైన మూడు నెలల తర్వాత ఆయనకు ఈ అవకాశం దక్కింది. సభలో ఆయన ప్రధానంగా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులపై చర్చించారు.దేశంలో 3.30 కోట్ల కేసులు, ఆంధ్రప్రదేశ్‌లో లక్షలకు పైగా కేసులు సుదీర్ఘకాలంగా వాయిదాలు పడుతున్నాయి. కొన్ని కేసులు ఏడేళ్లకుపైగా, మరికొన్ని మూడు సంవత్సరాలకుపైగా పెండింగ్‌లో ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి ఆరేళ్ల […]

ప్రతి ఇంటికి 15వేలు, బిజెపి లెక్కలు

“””””””””””””””””””””””””దేశవ్యాప్తంగా నవరాత్రి పండుగ సందర్భంలో బీజేపీ కేంద్రంలో జీఎస్టీ ఆదా ఉత్సవాలను నిర్వహిస్తోంది. పార్టీ నేతలు ప్రజలకు నెలకు సుమారు 15 వేల రూపాయల ఆదా ఏర్పడిందని ప్రచారం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పబ్లిక్ మీటింగ్స్, లెటర్స్ ద్వారా ఈ విషయంలో ప్రత్యేక సందేశాలు ఇచ్చారు.అయితే, పాలు మరియు ప్యాకెట్ పదార్థాలపై షాక్ అలాగే ఉంది. ఈ నెల 22 నుంచి అమలవుతున్న తగ్గింపులో టెట్రా ప్యాక్ పాలు మాత్రమే కొత్త రేట్లకు వర్తించగా, […]

ఆ యుద్ధానికి కారణం భారత్: ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐక్యరాజ్య సమితి సమావేశంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధానికి రష్యాకు ఆర్థిక సహాయం అందించడంలో భారత్, చైనా కీలక పాత్ర వహిస్తున్నట్లు ఆరోపించారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగించడమే దీని కారణమని చెప్పారు.ట్రంప్ నాటో (NATO) సభ్య దేశాలను కూడా నేరుగా విమర్శించారు. రష్యా పై మరింత కఠినమైన టారిఫ్‌లను విధించమని, వాణిజ్య సంబంధాలను పునరాలోచించాలని సూచించారు. యుద్ధాన్ని త్వరగా ముగించడానికి, రష్యా ఆర్థిక వనరులను నిలిపివేయడం […]

OG పై అంబటి రాంబాబు కామెంట్స్ వావ్

తెలుగు రాష్ట్రాల్లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మూవీ OG పై ఫ్యాన్స్‌లో భారీ హైప్ కొనసాగుతోంది. యంగ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్ వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు.బుధవారం రాత్రి ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఇప్పటికే అనఫీషియల్ రివ్యూలు, అంచనాలు తెరపైకి వచ్చాయి.అత్యంత హాట్ రివ్యూస్ మధ్య, వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ఆయన […]

ట్రంప్ కు ప్రాణాపాయం తప్పింది

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. బ్రిటన్ పర్యటనలో భాగంగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే హైడ్రాలిక్ సమస్య తలెత్తింది. దీంతో పైలెట్లు అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో ఆయనతో పాటు భార్య మెలానియా ట్రంప్ కూడా ఉన్నారు.20 నిమిషాల తర్వాత మరో హెలికాప్టర్ లో స్టాన్ సెడ్ విమానాశ్రయానికి వెళ్లారు. ఈ ఘటన వల్ల ఆయన అధికారిక షెడ్యూల్ లో స్వల్ప ఆలస్యం జరిగింది. ట్రంప్, మెలానియా […]

ట్రంప్‌ సంచలన నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలనానికి తెరలేపారు. వామపక్ష భావజాలంతో పనిచేస్తున్న యాంటీఫాను ఉగ్రవాద సంస్థగా గుర్తించనున్నట్లు ప్రకటించారు. కన్జర్వేటివ్ కార్యకర్త చార్లీ కిర్క్ హత్య నేపథ్యంలో ఈ నిర్ణయం మరింత హాట్‌టాపిక్‌గా మారింది.అయితే అసలు ప్రశ్న ఏమిటంటే.. యాంటీఫా నిజంగా ఒక సంస్థా? లేక కేవలం ఒక సిద్ధాంతమా?నిపుణుల అభిప్రాయం ప్రకారం, యాంటీఫాకు స్పష్టమైన నాయకత్వ నిర్మాణం లేదు. ఇది ఒక ఆలోచన, ఉద్యమం మాత్రమే. అమెరికా చట్టాల ప్రకారం ఉగ్రవాద సంస్థగా గుర్తించాలంటే […]