లైంగిక దాడి టైమ్‌లో ఆత్మరక్షణ కోసం దుండగుడి నాలుకను కొరికినందుకు శిక్షపడిన మహిళకు ఇప్పుడు నిర్దోషిగా తీర్పు వచ్చింది.
1963లో ఈ సంఘటన జరిగే సమయంలో చోయ్ మాల్-జాకు 18 ఏళ్లు మాత్రమే. ఆమెను లైంగికదాడి చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి నుండి తప్పించుకోవడానికి నాలుకను కొరికి పరారయ్యారు. అయితే అప్పట్లో కోర్టు దీనిని ఆత్మరక్షణగా గుర్తించకుండా ఆమెకు 10 నెలల జైలు శిక్ష వేసింది. దాడి చేసిన వ్యక్తికి మాత్రం కేవలం 6 నెలల శిక్షే పడింది, అది కూడా సస్పెండ్ చేశారు.
దీంతో చోయ్ జీవితాంతం నిందితురాలు అనే ముద్రతో బ్రతకాల్సి వచ్చింది. కానీ ఆమె న్యాయం కోసం ఆగలేదు. మీటూ ఉద్యమం స్ఫూర్తిగా కేసు తిరిగి తెరవమని ప్రయత్నాలు చేశారు. 2024 లో సుప్రీంకోర్టు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అనుమతి ఇచ్చింది.
ఇటీవల బుసాన్ కోర్టు ఆమె ఆత్మరక్షణలో భాగంగానే చెందినదని చోయ్‌ను నిర్దోషిగా ప్రకటించింది. ఈ తీర్పు వెలువడిన వెంటనే చోయ్ మద్దతుదారులు ఆనందంగా చోయ్ మాల్-జా గెలిచారు. అంటూ ప్లకార్డులు పట్టారు.
ప్రస్తుతం 79 ఏళ్ల వయసులో చోయ్, ఇది నా కోసమే కాదు, న్యాయం కోసం పోరాడే అన్ని లైంగిక వేధింపు బాధితుల కోసం సాధించిన విజయమని చెప్పారు.

