GST పై పొగడ్తలు, కానీ నిజమేది?

దేశవ్యాప్తంగా జీఎస్టీ స్లాబ్స్ తగ్గించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను బీజేపీ నేతలతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు కూడా ఆకాశానికెత్తేస్తున్నారు. దీపావళి కానుకలా ఈ నిర్ణయం పేదలు, మధ్యతరగతి వర్గాలకు మేలు చేస్తుందని చెబుతున్నారు.
అయితే అసలు జీఎస్టీని కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిందని, అప్పట్లో 5%, 12%, 14% మాత్రమే స్లాబ్స్ ఉన్నాయని అంటున్నారు. 2014 తర్వాత మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టి 18%, 24% స్లాబ్స్ జోడించింది. వీటి కిందకి ఎక్కువ సరుకులు తీసుకొచ్చి ప్రజలపై భారీ టాక్స్ భారం మోపింది.
కేవలం ఈ ఆర్థిక సంవత్సరం ఆరునెలల్లోనే జీఎస్టీ ద్వారా 22 లక్షల కోట్లు వచ్చాయని నిర్మలా సీతారామన్ స్వయంగా తెలిపారు. దశాబ్దం పాటు అధిక పన్నులు వసూలు చేసిన తర్వాత ఇప్పుడు తగ్గింపు చేసి మేలు చేస్తున్నట్టు చూపడం రాజకీయ వ్యూహమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇంకా పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని రాష్ట్రాలు కోరినా కేంద్రం స్పందించలేదు. అంతిమ యాత్రలకు అవసరమైన శవపేటికలపై కూడా జీఎస్టీ ఉండటం వివాదమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *