బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడే తీరు ఇప్పుడు పొలిటికల్ హీట్ కి దారితీస్తోంది. ఆయన మాటలతోనే పార్టీకి నష్టం జరుగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ చేసిన కామెంట్స్ కి, నిజానికి రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాలకి సరిపోలడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.
రేవంత్ కాలేజీల సమ్మెలకు త్వరగా పరిష్కారం చూపడం, విద్యార్థులతో నేరుగా మాట్లాడేందుకు సిద్ధం కావడం వంటి చర్యలు నియంత పాలన కాదని అంటున్నారు. కేసీఆర్ హయాంలో జరిగిన ఆర్టీసీ సమ్మె, ఆత్మహత్యల్ని కేటీఆర్ మరచిపోయారా? అని వ్యంగ్యంగా అడుగుతున్నారు.
అలాగే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ చేసిన విమర్శలు కూడా ఆయనపై రివర్స్ అవుతున్నాయి. కేసీఆర్ పది సంవత్సరాల పాలనలోనే ఎంతోమంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్‌లోకి చేర్చుకున్నారని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు ఉపఎన్నికలు పెట్టాలని సవాలు చేయడం సరే కాని, అప్పట్లో పార్టీమారినప్పుడు ఎందుకు పెట్టలేదని కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ కామెంట్స్ రాజకీయ ప్రత్యర్థులకు మాత్రమే కాదు, సాధారణ ప్రజలకు కూడా కామెడీలా అనిపిస్తున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.

