వైసీపీ లో డబుల్ గేమ్ నేతల ప్రక్షాళన

2024 ఎన్నికల ఓటమి తరువాత వైసీపీలో యాక్టివ్ నెస్ తగ్గిపోయింది. పార్టీ చేసిన ఆందోళనలు పెద్దగా జనాల్లోకి వెళ్లకపోవడంతో అధినాయకత్వం ఆందోళన చెందుతోంది. ఎవరు యాక్టివ్ గా ఉన్నారు, ఎవరు సైలెంట్ గా ఉన్నారన్న లిస్ట్ జగన్ చేతుల్లోకి చేరింది. ఆ లెక్కల ప్రకారం చిన్న పెద్ద నేతలు వందమందికి పైగా కీలక నాయకులు పూర్తిగా మౌనంగా ఉన్నట్లు తేలింది.
దీనిపై జగన్ తీవ్ర హెచ్చరికలు చేస్తున్నట్లు సమాచారం. పార్టీలో ఉంటూ పనిచేయని నేతలకు స్థానం ఉండదని, అవసరం లేని వారు వెళ్ళిపోవచ్చని స్పష్టం చేస్తున్నట్లు చెబుతున్నారు. సీనియర్ అయినా, గ్రేట్ నేతలైనా, పనికొచ్చే వారు కావాలి కానీ ఉత్సవ విగ్రహాలు అవసరం లేదని హైకమాండ్ భావిస్తోంది.
వచ్చే ఎన్నికల దృష్ట్యా పార్టీ లైన్ లోనే నడవాలి, లేకుంటే బయటకెళ్ళాలి అన్న సందేశం జగన్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా మౌనంగా ఉన్న నేతల జాబితా సిద్ధమైంది. ఇప్పుడు వారు పార్టీతో గ్యాప్ తగ్గించుకుంటారా అనేది తెలియాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *