కెటిఆర్ ట్వీట్, జగన్ కి అవమానం

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్‌తో ఏపీ రాజకీయాల్లో చర్చ మొదలైంది. మహబూబ్‌నగర్ దగ్గర అమరరాజా EV బ్యాటరీ యూనిట్ నిర్మాణం పూర్తవుతున్న ఫొటోలను కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ, తాము అధికారంలో ఉన్నప్పుడే ఈ పరిశ్రమను తీసుకువచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఇందులో పొలిటికల్ కామెంట్స్ లేకపోయినా, ఆంధ్రప్రదేశ్‌లో ఇది వైసీపీ అధినేత జగన్‌కు పెద్ద ఇబ్బంది కలిగించిందని విశ్లేషకులు అంటున్నారు.
అమరరాజా యజమాని గల్లా జయదేవ్ తెలుగుదేశం నేత కావడంతో, జగన్ ప్రభుత్వం కాలుష్యం పేరుతో ఈ పరిశ్రమను ఏపీలో అనుమతించలేదని విశ్లేషకులు అన్నారు. దీంతో 9,500 కోట్ల పెట్టుబడితో వేల మందికి ఉపాధి కల్పించే ఈ యూనిట్ తెలంగాణకు వెళ్లిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేటీఆర్ ట్వీట్‌ను వైరల్ చేస్తూ జగన్ వల్లే ఏపీకి పెద్ద నష్టం జరిగిందని ప్రత్యర్థులు దాడి చేస్తున్నారు.
అమరరాజా పరిశ్రమ తెలంగాణలో శరవేగంగా పూర్తి అవుతుండగా, ఏపీలో పరిశ్రమల వాతావరణం దెబ్బతింటోందని రాజకీయ చర్చలు జోరందుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *