యానాం ONGC గ్యాస్ లీక్, భయం భయం

యానాం సమీపంలో ఓఎన్‌జీసీ గ్యాస్ పైప్‌లైన్ ఒక్కసారిగా లీక్ కావడంతో భారీ మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురై వెంటనే అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన అధికారులు సముద్రంలోనే గ్యాస్ సరఫరాను నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. అయితే తరచుగా జరుగుతున్న గ్యాస్ లీకేజీలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, చమురు సంస్థలు తరచూ తనిఖీలు నిర్వహించి భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గ్యాస్ పైప్‌లైన్‌ల వద్ద భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు చేయాలని, గ్యాస్ వాసన గమనించిన వెంటనే అధికారులు తెలియజేయాలని సూచిస్తున్నారు. గతంలో కోనసీమ జిల్లాలో కూడా ఇలాంటి గ్యాస్ లీక్ ఘటనలు జరిగి ప్రజలు ఇబ్బందులు పడ్డ విషయం గుర్తు చేసుకుంటూ, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *