షారుక్ ఖాన్, దీపికా పదుకొనెల పై చీటింగ్ కేస్‌

రాజస్థాన్‌లో షారుక్ ఖాన్, దీపికా పదుకొనెల పై హ్యుండాయ్ కార్ల ప్రకటనకు సంబంధించి చీటింగ్ కేస్‌లో ఇరుక్కున్నారు. భరత్‌పూర్ జిల్లా నివాసి కీర్తి సింగ్‌ ఈ ఇద్దరి ప్రమోషనల్ ప్రకటన చూసి 24 లక్షల విలువైన హ్యుండాయ్ అల్కాజర్ కారును కొన్నప్పటికీ, ఆరు నెలల్లో ఇంజిన్‌లో టెక్నాలజీ సమస్యలు రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. షోరూం సిబ్బంది కూడా మోడల్‌లో డిజైన్ సమస్యలున్నాయి, సరి చేయలేమంటూ సరిగ్గా పట్టించుకోలేదని కోర్టులో చెప్పారు. మొదట పోలీసులు experts రిపోర్ట్ ఆధారంగా కేసు నమోదు చేయకపోయినా, అసంతృప్తి వ్యక్తం చేసిన కీర్తి హైకోర్టును ఆశ్రయించారు. భరత్‌పూర్ CJM కోర్టు విచారణలో షారుక్, దీపికా హ్యుండాయ్ బ్రాండ్ అంబాసిడర్లు కాబట్టి ప్రజలను తప్పుదోవ పట్టించారని, వినియోగదారుడికి నష్టం జరిగింది కాబట్టి బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేసింది. ఫలితంగా మధుర్‌గేట్ పోలీసులు షారుక్, దీపికా, హ్యుండాయ్ కంపెనీకి చెందిన ఆరుగురు సిబ్బందిపై IPC 420 చీటింగ్ సెక్షన్‌ పై కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *