బతికున్నవారిని చూసుకోండి: సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు ప్రభుత్వాల వృథా ఖర్చులపై స్ట్రాంగ్ కామెంట్స్ చేసింది… ముందు బతికున్నవారిని చూసుకోండి, తర్వాత చనిపోయినవారికి విగ్రహాలు పెట్టండని స్పష్టంగా చెప్పింది. ప్రజల పన్నుల రూపంలో వచ్చే డబ్బు ప్రజల సంక్షేమం కోసం మాత్రమే ఖర్చు చేయాలని హెచ్చరించింది.
విద్య, ఆరోగ్యం, ఉపాధి, ఆహారం వంటి ప్రాథమిక అవసరాలు తీరకపోతే, కోట్ల రూపాయలు విగ్రహాల నిర్మాణాలకు ఖర్చు చేయడం నైతికంగా సరైంది కాదని కోర్టు చెప్పింది. చాలాసార్లు విగ్రహాల ప్రాజెక్టులు రాజకీయ ప్రయోజనాల కోసమే జరుగుతున్నాయని కూడా వ్యాఖ్యానించింది.
తమిళనాడులో జయలలిత, కరుణానిధి విగ్రహాలపై వచ్చిన వివాదాలను కూడా ఈ సందర్భంగా గుర్తుచేసింది. మద్రాస్ హైకోర్టు ఇప్పటికే ప్రభుత్వ ఉత్తర్వులపై ప్రశ్నలు లేవనెత్తినట్లు తెలిపింది.
ప్రజలు ఉపాధి సమస్యలు, పెరిగిన ధరలు, పేదరికంతో ఇబ్బందులు పడుతున్న సమయంలో, విగ్రహాలపై వృధా ఖర్చు ప్రజలకు వ్యతిరేకమని కోర్టు తెలిపింది.
ప్రజల అవసరాలు తీర్చడం ప్రభుత్వాల మొదటి బాధ్యత అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.c

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *