రాష్ట్ర శాసనమండలిలో మంగళవారం నాడు.. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటు అంశంపై అధికార–ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. విశాఖలో ఉర్సా కంపెనీకి ఎకరా భూమి ఒక్క రూపాయికే ఇచ్చారని బొత్స సత్యనారాయణ ప్రశ్నించగా, మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. తాను అలాంటి మాట ఎప్పుడూ చెప్పలేదని, నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. టీసీఎస్, కాగ్నిజెంట్ కంపెనీలకే ఒక్క రూపాయికి భూములు ఇచ్చామని, ఉర్సాకు మాత్రం ఇవ్వలేదని లోకేష్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై అధికార–ప్రతిపక్షాల మధ్య వేడెక్కిన చర్చ కొనసాగింది.
అసెంబ్లీ వేదికగా ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.
ప్రతిపక్షం పెట్టుబడుల కేటాయింపులో అవకతవకలు ఉన్నాయని ఆరోపించింది.
అధికారపక్షం మాత్రం transparent గానే భూములు కేటాయించామని తెలిపింది.
ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వొద్దని మంత్రి లోకేష్ ప్రతిపక్షాన్ని హెచ్చరించారు.
రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవద్దని ఆయన తెలిపారు.

