OG పై అంబటి రాంబాబు కామెంట్స్ వావ్

తెలుగు రాష్ట్రాల్లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మూవీ OG పై ఫ్యాన్స్‌లో భారీ హైప్ కొనసాగుతోంది. యంగ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్ వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
బుధవారం రాత్రి ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఇప్పటికే అనఫీషియల్ రివ్యూలు, అంచనాలు తెరపైకి వచ్చాయి.
అత్యంత హాట్ రివ్యూస్ మధ్య, వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ లో OG ఖచ్చితంగా హిట్ అవుతుందని తెలిపారు. పవన్ గత రెండు సినిమాలు ఫ్లాప్ అవడంవల్ల, ఆయన కసితో పనిచేశారని, డైరెక్టర్, నిర్మాతలు పూర్తి పట్టుదలతో పని చేసి ఉంటారని అంబటి పేర్కొన్నారు.
ఇక రాజకీయ పరంగా పవన్ ప్రత్యర్థి అయినప్పటికీ, ఈసారి మూవీపై పాజిటివ్ కామెంట్స్ చేయడం విశేషంగా మారింది. దీంతో వైసీపీ నేతలు షాక్ కి గురయ్యారు. వైసిపి నేతలు అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై ప్రశ్నించడం మానేసి… సినిమాలకు రివ్యూలు ఇస్తున్నారని కొందరు విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *