NDA కు వైసిపి అధినేత జగన్ జై జై

ఏపీ రాజకీయాల్లో మరోసారి పెద్ద ట్విస్ట్ కనిపిస్తోంది. ఢిల్లీలో ఉప రాష్ట్రపతి ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్డీఏ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్‌, తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ పేరును ప్రకటించింది. ఇదే సమయంలో ఇండియా కూటమి కూడా తమ అభ్యర్థిని తుది నిర్ణయం తీసుకోబోతోంది. ఈ కసరత్తులో భాగంగా బీజేపీ అగ్రనేత రాజ్‌నాథ్‌సింగ్‌ మాజీ సీఎం జగన్‌కు ఫోన్ చేసి రాధాకృష్ణన్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. దీనికి జగన్ సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే వైసీపీకి లోక్‌సభలో 4, రాజ్యసభలో 7 మంది సభ్యులు ఉన్నారు. వీరి మద్దతు కూడా ఎన్డీఏకు కలిసివచ్చేలా ఉంది. వాస్తవానికి ఎన్డీఏకి మెజార్టీ ఉన్నప్పటికీ, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇతర పార్టీలను కూడా వశం చేసుకోవాలన్న ప్రయత్నం కొనసాగుతోంది. మరోవైపు జగన్ ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ నేత రాహుల్ పై విమర్శలు చేస్తూ, ఏపీలో చంద్రబాబు పవన్ కూటమిని టార్గెట్ చేస్తున్నారు. 2019లో మాదిరిగానే ఈసారి కూడా ఢిల్లీలో కీలక సందర్భంలో జగన్ ఎన్డీఏ వైపు మొగ్గు చూపడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ మొదలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *