1500 గజాలు కొట్టేశారు: కరాటే కళ్యాణి

సినిమా నటిగా, సామాజికవేత్తగా పేరున్న కరాటే కళ్యాణి బంజారాహిల్స్ భూ వివాదంపై సంచలన ఆరోపణలు చేశారు.
కరాటే కళ్యాణి వెల్లడించిన వివరాల ప్రకారం బంజారాహిల్స్‌లోని 1500 గజాల విలువైన స్థలాన్ని, 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో, మేయర్ గద్వాల విజయలక్ష్మి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. గజం 350 రూపాయలకే రిజిస్ట్రేషన్ జరిగిందని, కానీ అదే స్థలం పెద్దమ్మ గుడి కోసం అడిగితే గజం 2 లక్షలు చెప్పారని ఆరోపించారు.
ఈ స్థలం నిజంగా పెద్దమ్మ గుడి పరిధిలో ఉండాల్సిందని, దశాబ్దాలుగా అక్కడ గుడి ఉన్నప్పటికీ దానికి కేటాయించకుండా, మేయర్ పేరుపై ఎలా రిజిస్ట్రేషన్ చేశారని ప్రశ్నించారు. మేయర్‌కు ఇంత పెద్ద స్థలాన్ని ఎందుకు కేటాయించారు? ఆమె స్వాతంత్ర్య సమరయోధురాలా లేక కుటుంబ వారసత్వమా?అని కరాటే కళ్యాణి నిలదీశారు. ఆధారాలతో వీడియో విడుదల చేసిన ఆమె, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ భూ దందా ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *