అమ్మతనం అందరికీ ఆశ. అయితే కాలం మారిపోవడంతో కొందరు దంపతులు ఆర్థిక పరిస్థితులు, కెరీర్ కారణాలతో సంతానం ఆలస్యంగా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు సంతానం కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నవారు ఉన్నారు. ఇదే సమయంలో అబార్షన్ల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజా గణాంకాల ప్రకారం తెలంగాణలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 16,059 అబార్షన్స్ జరిగాయి. ఐదేళ్లలో ఇవి 10 రెట్లు పెరిగాయి. పొరుగున ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. అక్కడ ఇదే కాలంలో 10,676 అబార్షన్స్ జరిగి, ఐదేళ్లలో నాలుగు రెట్లు పెరిగాయి. ఈ గణాంకాలు సమాజంలో కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.
నిపుణులు చెబుతున్నదేమిటంటే అవగాహన లోపం, జీవనశైలి మార్పులు, సామాజిక ఒత్తిడులు ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలు. సకాలంలో సరైన వైద్య సలహా, కుటుంబ ప్రణాళికపై స్పష్టమైన అవగాహన అవసరమని సూచిస్తున్నారు. లేకపోతే ఈ సమస్య మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు

