info@raviproduction.com

టీ20 వరల్డ్ కప్: సౌతాఫ్రికా చేతిలో భారత్‌ ఓటమి

ఐసీసీ టీ20 World Cup 2026 సూపర్-8 దశలో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్‌లో సౌతాఫ్రికా 76 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లకు 187 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ 63 పరుగులతో చెలరేగగా, బ్రెవిస్ 45, స్టబ్స్ 44 విలువైన ఇన్నింగ్స్ ఆడారు. భారత్ తరఫున బుమ్రా 3 వికెట్లు తీశాడు.187 పరుగుల లక్ష్యంతో బరిలోకి […]

హైదరాబాద్‌లో ఫెరారీ కారు బీభత్సం

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్ నెం.45 వద్ద అతివేగంతో దూసుకెళ్తున్న ఫెరారీ కారు అదుపుతప్పి డివైడర్‌పైకి ఎక్కి మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావంతో కారు రోడ్డుకు అవతలివైపు వెళ్లి ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొట్టింది.ఈ ఘటనలో ఫెరారీ కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఎదురుగా వస్తున్న రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో మొత్తం మూడు కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరికొన్ని ద్విచక్ర వాహనాలు కూడా […]

వారికి బంపర్ ఆఫర్ అంటున్న పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలో మళ్లీ కొత్త ఉత్సాహం మొదలైంది. ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే పార్టీ బలోపేతంపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. కూటమి ప్రభుత్వంలో భాగంగా ఇరవై నెలలు పూర్తవుతున్న వేళ, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తగ్గిందన్న నివేదికలపై ఆయన సమీక్ష చేపట్టారు.పార్టీ స్థాపననుంచి శ్రమించిన జనసైనికులకు తగిన గుర్తింపు దక్కలేదన్న భావనను అధినాయకత్వం గమనించింది. నామినేటెడ్ పదవులు ఆశించిన వారికి అవకాశాలు పరిమితమవడంతో కొంత నిరుత్సాహం నెలకొన్నట్టు తెలుస్తోంది. […]

జగన్ విత్ కేవీపీ, మాస్టర్ ప్లాన్ సెట్ అయ్యేనా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. YS జగన్, KVP రామచంద్రరావు చాలా ఏళ్ల తర్వాత చెన్నైలో జరిగిన కుటుంబ వివాహ వేడుకలో ఆత్మీయంగా కలుసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కేవీపీ, దివంగత YS. రాజశేఖర్ రెడ్డి కి ఆత్మీయుడిగా, వ్యూహకర్తగా పేరొందారు. వైఎస్సార్ హయాంలో ఆయన చేసిన సూచనలు successful గా ఉండేవని చెబుతారు. బెంగళూరు కేంద్రంగా వ్యూహాలు రచిస్తున్న జగన్, పాత అనుబంధాలను తిరిగి కలుపుకుంటున్నారన్న ప్రచారం […]

ఏపీ లిక్కర్ స్కాంలో ఏ2 అరెస్టు, నెక్స్ట్ బిగ్‌బాస్?

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన 3,500 కోట్ల లిక్కర్ స్కాం దర్యాప్తు కీలక మలుపు తిరిగినట్టుగా చర్చ జరుగుతోంది. ఈ కేసును సీఐడీ సిట్ విచారిస్తోంది. ఇప్పటివరకు 50 మందికి పైగా వ్యక్తులు, సంస్థలను నిందితుల జాబితాలో చేర్చగా, సుమారు 15 మందిని అరెస్టు చేశారు. అయితే ప్రధాన నిందితులుగా పేర్కొన్న ఏ2, ఏ3, ఏ5లపై ఇంతకాలం ఎలాంటి చర్యలు లేకపోవడం సస్పెన్స్ గా మారింది.ఈ నేపథ్యంలో ఏ2 వాసుదేవరెడ్డిని అకస్మాత్తుగా అరెస్టు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర […]

TTD లో చుక్క కల్తీ జరిగినా పట్టేస్తారు

తిరుమల క్షేత్రంలో కల్తీకి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు సురక్షితమైన, నాణ్యమైన ప్రసాదాలు అందించాలనే లక్ష్యంతో రూ.25 కోట్ల వ్యయంతో అత్యాధునిక ఫుడ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తోంది. వచ్చే నెలలో ఇది అందుబాటులోకి రానుంది.ఈ ప్రాజెక్టుకు కేంద్రం–రాష్ట్రం సంయుక్తంగా సహకారం అందిస్తున్నాయి. Food Safety and Standards Authority of India 23 కోట్లు మంజూరు చేసింది. తిరుమల పిండిమిల్లు ఆవరణలో 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ల్యాబ్ ఏర్పాటవుతోంది.నెయ్యి, జీడిపప్పు, […]

కాంగ్రెస్‌ది మురికి రాజకీయం అంటూ మోదీ ఆగ్రహం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ మురికి రాజకీయాలకు పాల్పడుతోందని, దేశ ప్రతిష్టను దెబ్బతీసే చర్యలు చేస్తోందని మండిపడ్డారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ను రాజకీయ వేదికగా మార్చడం తగదని అన్నారు. విదేశీ శక్తులతో చేతులు కలిపి భారత్ పరువును తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.ఏపీ ఇంపాక్ట్ సమ్మిట్ లో కాంగ్రెస్ యువజన విభాగానికి చెందిన కొంతమంది కార్యకర్తలు అర్ధనగ్నంగా నిరసన […]

ఉగాది తర్వాత జగన్ కొత్త రూట్

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీని పటిష్టం చేయడంపై దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం బెంగళూరులో ఉంటూనే పార్టీ సంస్థాగత నిర్మాణంపై వ్యూహాలు రచిస్తున్నారని సమాచారం. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రౌండ్ లెవెల్‌లో పార్టీని బలంగా నిలబెట్టాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జిలను నియమించిన వైసీపీ, బూత్ స్థాయి కమిటీల ఏర్పాటును వేగవంతం చేసింది. ప్రతి నియోజకవర్గంలో కనీసం 15 వేల […]

ఆయేషా మీరా హత్య కేసు క్లోజ్, 17 ఏళ్ళుగా తేలలేదు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు అధికారికంగా ముగిసింది. 2007లో జరిగిన ఈ దారుణ ఘటనపై దాదాపు 17 ఏళ్ల పాటు విచారణ కొనసాగినా, అసలు నిందితుడు ఎవరో తేల్చలేక కేసు క్లోజ్ అయింది. విజయవాడలోని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అన్నపూర్ణ తుది ఉత్తర్వులు జారీ చేస్తూ కేసును మూసివేస్తున్నట్టు ప్రకటించారు.హైకోర్టు ఆదేశాల మేరకు 2019లో సీబీఐ దర్యాప్తు చేపట్టి పలు కోణాల్లో విచారణ జరిపింది. మృతదేహ అవశేషాలతో […]

నారా భువనేశ్వరి వీడియో మెసేజ్ వైరల్

Heritage Foods సంస్థ ప్రస్థానం, నాణ్యతా ప్రమాణాలపై వైస్ చైర్‌పర్సన్ మరియు ఎండీ నారా భువనేశ్వరి విడుదల చేసిన వీడియో మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తిరుమల లడ్డూ నెయ్యి నాణ్యతపై రాజకీయ చర్చలు నడుస్తున్న నేపథ్యంలో, హెరిటేజ్ ఉత్పత్తుల విశ్వసనీయతపై ఆమె స్పష్టతనిచ్చారు.33 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, 4 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైన సంస్థ నేడు 4 వేల కోట్ల టర్నోవర్‌ సాధించిందని తెలిపారు. ఎంత ఎదిగినా నాణ్యత విషయంలో రాజీపడలేదని స్పష్టం చేశారు. […]