వైసిపి నేత అనిల్ కుమార్ యాదవ్ హల్ చల్

మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ సోమవారం నెల్లూరు డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఫిర్యాదుతో ఆయనను నిందితుడిగా నమోదు చేశారు.
ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఏ1గా, అనిల్ కుమార్ యాదవ్ ఏ2గా ఉన్నారు.
పోలీసులు ఇద్దరి నుంచి వాంగ్మూలాలను నమోదు చేశారు.
ఈ విచారణకు అనిల్ కుమార్ వందలాది మంది కార్యకర్తలతో హాజరయ్యారు. వారు అరుస్తూ, జగన్ సిఎమ్ అనుకుంటూ, కూటమిని నిరసిస్తూ రావడంతో
డీఎస్పీ కార్యాలయం దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
గతంలో ఆయనకు రెండుసార్లు నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు హాజరు కాలేదు.
తాజాగా విచారణకు హాజరై పోలీసులు అడిగిన పశ్నలకు జవాబులు ఇచ్చారు.
తనపై ఉన్న కేసును కొట్టివేయాలని ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. మళ్ళీ నోటీసులు ఇస్తారా? అరెస్ట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *