కెప్టెన్ గిల్లయ్యా ఇంగ్లాండోళ్లోని గట్టిగానే గిల్లేశాడు.. కెప్టెన్‌గా
మొదటి సిరీస్ లోనే వారెవ్వ ఇరగదీసేశాడు మరి. ఇంగ్లండ్ కి తన గడ్డపైనే నోట్లో మాట రాకుంట చేసేసినాడంతే.
ముందు మ్యాచ్‌లు ఎలాగున్నా, ఐదోటెస్టు అసలైన మాస్ జాతరేస్.
హైదరాబాదోడు సిరాజ్ అట్టా ఇట్టాకాదు.. బాలేత్తే వికెట్ బద్దలేసిపోయినాయ్ అంతే..
ఆరు వికెట్లకి 339 రన్నులతో ఐదో రోజు మొదలెట్టేసిన ఇంగ్లాండోళ్ళకి శాలా ఈజీ గెలవటం.. 35 రన్నులు సేత్తే ఇట్టా గెలిసేత్తరు..
కానీ సిరాజ్… ఒక పక్క, ప్రసిద్ధ్ ఒక పక్క బాబోయ్.. సురకత్తుల్లాగా బాల్స్ ఏత్తంటే బ్యాటింగోళ్ళ గుండెలు బేజారెత్తిపోయినయ్ మరి. ఇండియా ఇంగ్లండ్ గడ్డను గడ్డిబొమ్మలాగా లాగేసిందంటే మాటలు గాదు. ఒకటి నువ్వు… ఒకటి నేను… చివరికి డ్రా అంటూ లవ్వాడుకున్నట్టు సిరీస్ సమం అయిపోయింది. హైదరాబాదీ హీరో మొహమ్మద్ సిరాజ్ బంతుల కత్తులతో కనికట్టు సేసేశాడు.
దెబ్బకు ఒక్కొక్కొడ్ని ఏసేత్తా అని రెబల్ మూవీలో ప్రభాస్ అన్నట్టు ఒకవైపు ప్రసిద్ధ్ బౌలింగ్, ఒకవైపు సిరాజ్ బౌలింగ్ ఇరగేశారు. చివరికి 367కే కూలగొట్టి పడేశార్లే. మొత్తం సిరీస్‌లో 23 వికెట్లు తీసి, సిరాజ్ మామ భలే మాస్ అయిపోయాడు.
మనోడికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్.. ఇక గిల్ అయితే తన మొదటి సిరీస్ లోనే కొదమసింహంలా నిలబడ్డాడు.. సూపర్ అంటే సూపరంతే

