
పాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్ మరోసారి మాస్ స్క్రీన్‌పై సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు.
సలార్, కల్కి 2898 విజయం తర్వాత ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఆసక్తి పెరిగింది.
మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజాసాబ్ పై భారీ అంచనాలు ఉన్నాయి.
మాస్, హారర్, కామెడీ కలబోసిన ఈ మూవీ, ఫ్యామిలీ ఆడియన్స్‌కి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని మూవీ యూనిట్ చెప్తోంది.
ఇటీవల విడుదలైన టైటిల్ పోస్టర్, గ్లింప్స్‌కు విశేష స్పందన వచ్చింది.
బాలీవుడ్ బ్యూటీ మాళవికా మోహనన్ ఈ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇస్తోంది..
నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కూడా ఈ మూవీలో నటిస్తున్నారు.
సంజయ్ దత్ కీ రోల్ ఈ మూవీకి బోనస్.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
డిసెంబర్ 5 రిలీజ్ డేట్ తాజాగా వచ్చిన పోస్టర్‌లో లేదు. దీంతో సినిమాపై వాయిదా వార్తలు మళ్లీ తెరపైకి వచ్చాయి.
దీంతో ప్రభాస్ అభిమానులు రిలీజ్‌పై స్పష్టత కోరుతూ సోషల్ మీడియాలో ఫుల్ హడావుడి చేస్తున్నారు

