తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల ముఖ్య నేతలైన కేసీఆర్, జగన్ రాజకీయ తీరులో చాలా పోలికలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలైన ఈ ఇద్దరూ అసెంబ్లీకి దూరంగా ఉంటూ ఇప్పటివరకు సభా కార్యక్రమాలకు హాజరు కాలేదు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. సెప్టెంబర్ మూడో వారం నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు జగన్ హాజరవుతారని సమాచారం. టీడీపీ కూటమి ప్రభుత్వంపై సభలోనే బహిరంగంగా విమర్శలు చేస్తారని అంటున్నారు. మరోవైపు తెలంగాణాలో కూడా కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని ప్రచారం. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కమిషన్ రిపోర్టు చర్చలో పాల్గొని తన ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించుకోవడంతో పాటు కాంగ్రెస్‌పై దాడి చేస్తారని చెబుతున్నారు. మొత్తానికి ఈసారి ఇద్దరు నేతలు సభలో కనిపిస్తే అసెంబ్లీ సమావేశాలు మరింత ఉత్కంఠభరితంగా ఉండనున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ ప్రజా సమస్యలు ఎక్కువగా ఉండటంతో, ఈసారి సభలో చర్చలు వేడెక్కే అవకాశం ఉంది. కేసీఆర్–జగన్ హాజరుతో రాజకీయ వాతావరణం కొత్త మలుపు తిప్పనుంది.

