షర్మిలపై కాంగ్రెస్ నేతల ఫైర్

రాష్ట్ర కాంగ్రెస్‌లో మళ్లీ షర్మిల పేరు హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల పార్టీ డీసీసీల నియామకాలు చేస్తామని అధిష్ఠానం ప్రకటించగా, చాలా మంది నాయకులు పదవుల కోసం ఆసక్తి చూపించారు. కానీ షర్మిల పార్టీ అధిష్ఠానానికి లేఖ రాసి ఇప్పుడే డీసీసీల అవసరం లేదని చెప్పినట్టు సమాచారం. ఆమె అభిప్రాయం ప్రకారం ఇప్పుడు పదవులు ఇస్తే అధికార కేంద్రాలు ఏర్పడి, పార్టీకి సమస్యలు వస్తాయని భావిస్తున్నారు. అంతేకాక కొందరు నాయకులు క్రమశిక్షణ పాటించడం లేదని, సొంత అజెండాలతో ముందుకు వెళ్తున్నారని షర్మిల ఆరోపణలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో కొందరు నాయకులు అసంతృప్తితో అంతర్గతంగా పార్టీని వదిలిపోవాలని కూడా మాట్లాడుకుంటున్నారని సమాచారం. ఇప్పటికే చాలామంది దూరమవ్వగా, ఇప్పుడు మరింత మంది ఆమెకు వ్యతిరేకంగా గళం వినిపించడం కాంగ్రెస్‌లో కొత్త కలకలానికి దారితీస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *