విశాఖ మహా నగర అభివృద్ధి సంస్థ కొత్తగా స్పెషల్ థీమ్‌తో టౌన్‌షిప్‌లు అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఫ్లోరిడా మోడల్‌లో విశాఖపట్నాన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఒక కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. విశాఖ నుంచి భోగాపురం మధ్య నాలుగు ప్రాంతాల్లో ఈ థీమ్ టౌన్‌షిప్‌లు ఏర్పాటుచేస్తారు. అందులో ఒకటి కొత్తవలస దగ్గర మరొకటి ఆనందపురం మండలంలోని శొంఠ్యాం ప్రాంతం దగ్గర రానున్నాయి. మరో రెండు ప్రాంతాలను గుర్తించాల్సి ఉంది. విశాఖను బే సిటీ మియామీగా అభివృద్ధి చేయాలని ఈ ప్రాజెక్టును చేపట్టారు. ప్రతి టౌన్‌షిప్‌కు ప్రత్యేకమైన థీమ్ ఉంటుంది. ఐటీ అండ్ ఇన్నోవేషన్, హెల్త్ అండ్ వెల్‌నెస్, నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్, టూరిజం అండ్ కల్చర్, లాజిస్టిక్స్ అండ్ ట్రేడ్, ఎకో రీసైలెన్స్ వంటి ప్రత్యేకతలు ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. ఒక్కో టౌన్‌షిప్ ఒక్కో ప్రత్యేకత ఉండేలా అభివృద్ధి చేస్తారు. మాస్టర్ ప్లాన్ రూపొందించి లేఅవుట్లు వేయడమే కాకుండా పెట్టుబడుల ఆకర్షణకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూరుస్తారు. Modern technology ద్వారా ఈ టౌన్‌షిప్ లను ఏర్పాటు చేస్తారు.

