ఏపీ లిక్కర్ స్కామ్ సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇప్పటికే కీలక నిందితుల్ని అరెస్టు చేశారు. విచారణలో భాగంగా నిందితులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ అరెస్టు అవుతారన్న ప్రచారాన్ని కూటమి నేతలు తెరపైకి తెస్తున్నారు. అయితే సిట్ మాత్రం దీనిపై ఇంకా నోరు విప్పలేదు. ఇదే నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ప్రజలు తనను ఓడించారనే కోపంతో రాష్ట్రం అభివృద్ధి కాకూడదని, రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆరోపించారు. లిక్కర్ స్కాంలో జగన్ అరెస్టుపైనా ఆయన స్పందించారు. లిక్కర్ స్కాంలో వైఎస్ జగన్ అరెస్ట్ ఖాయమని, అయితే ఎప్పుడు అరెస్టు అవుతారో డేట్ మాత్రం చెప్పలేమని నల్లమిల్లి వెల్లడించారు. అరెస్ట్ మాత్రం ఖాయమన్నారు. లిక్కర్ స్కాంలో నిందితులు బిగ్‌బాస్ ఎవరో చెప్పినట్లుగా సిట్ వద్ద వీడియో ఆధారాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

