చంద్రబాబు, లోకేష్ ఢిల్లీకి, అందుకేనా?

ఏపీ సిఎమ్ చంద్రబాబు ఈరోజు రాత్రి ఢిల్లీకి వెళ్తున్నారు. మంగళవారం జరిగే ఉపరాష్ట్రపతి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం ఆయన పర్యటనకు అధికారిక కారణమని చెబుతున్నా, రాజకీయ నిర్ణయాలు కూడా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. మంత్రి నారా లోకేశ్ ఆదివారం రాత్రే ఢిల్లీ చేరుకుని పలువురు కేంద్ర మంత్రులతో అపాయింట్‌మెంట్లు తీసుకున్నారు. సీఎం చంద్రబాబు కూడా ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులతో రాష్ట్ర ప్రాజెక్టులపై చర్చించనున్నారు. ఇదిలా ఉండగా, ఆదివారం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం, సోమవారం ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం జరుగుతుండటం, ఇద్దరు నేతలు ఒకేసారి ఢిల్లీకి వెళ్లడం ఏపీ అంతటా ఆసక్తి రేపుతోంది. వైసీపీకి చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. లిక్కర్ స్కాంలో అసలు సూత్రధారి గురించి కీలక ఆధారాలు దొరికాయని, ఈ కేసులో చర్యలు తీసుకోవడానికి కేంద్రం సహకారం కోరనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరిపి, తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని, ఈ పర్యటన ఏపీలోనే గేమ్‌చేంజర్‌ అవచ్చని చర్చ జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *