లిల్లీపుట్ కామెంట్లతో వేడెక్కిన బిఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇంట్లో వివాదం బాగా ముదిరి పాకాన‌ పడుతోంది. క‌ల్వ‌కుంట్ల ఆడబిడ్డ క‌విత‌కు కెటీఆర్ కు మధ్య మొద‌లైన విభేదాలు పెద్ద తుఫానుగా మారిందనేది తెలిసిన విషయమే. కవిత తన తండ్రి కెసిఆర్ కు రాసిన లెటర్ కథ నుంచి మొదలైన పోరు పార్టీ చీలిపోయే పరిస్థితికి వచ్చింది. అన్న కెటిఆర్ పై ప్రత్యక్షంగా పరోక్షంగా కామెంట్స్ చేస్తున్న కవితపై సస్పెన్షన్ వేటు వేయాలనే ఆంశం తెరపైకి వచ్చింది. క‌విత ప్రధానంగా ఉన్న తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం బాధ్య‌త‌ కేటీఆర్ తన సొంత నిర్ణయంతో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ కు అప్ప‌గించారు. దీనిపై కవిత మాట్లాడుతూ పార్టీలో పెద్ద నాయ‌కుడు తనపై కక్ష పెంచుకున్నారని క‌విత ఆరోపించారు. న‌ల్ల‌గొండ జిల్లాలో పార్టీని గెలిపించలేకపోయిన లిల్లీపుట్ నాయ‌కుడు త‌న గురించి మాట్లాడే ధైర్యం వచ్చిందా? కేసీఆర్ లేకుంటే ఆ లిల్లీపుట్ ఎక్క‌డ‌? అంటూ వివాదస్పద కామెంట్స్ చేశారు.. తాను రాసిన లేఖ‌ను లీక్ చేసింది ఎవ‌రు? అంటూ సీరియస్ అయ్యారు. దీంతో నల్గొండ బిఆర్ఎస్ లీడర్ జగదీశ్వర్ రెడ్డి, కొంతమంది లీడర్లతో సమావేశమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *