తెలంగాణా క్రీడాలోకంలోకి ఉపాసన ఎంట్రీ.

తెలంగాణ రాష్ట్రం క్రీడారంగానికి సంబంధించి ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణాలో క్రీడల అభివృద్ధి కోసం ప్రభుత్వం గవర్నింగ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అనే కొత్త బోర్డ్ ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా ప్రముఖ వ్యాపారవేత్త, అపోలో గ్రూప్ వైస్ చైర్‌పర్సన్, హీరో రామ్ చరణ్ భార్య అయిన ఉపాసన కామినేనిని ఈ బోర్డుకు కో-చైర్‌పర్సన్‌గా నియమించారు.
ఈ బోర్డుకు చైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్. సంజీవ్ గోయెంకా ను నియమించారు. ఈ బోర్డులో అన్ని విభాగాలకు చెందిన వారిని మెంబర్స్ గా తీసుకున్నారు. హర్యానా హరికేన్ కపిల్ దేవ్, బ్యాడ్మింటన్ మాస్ట్రో పుల్లెల గోపీచంద్, ఒలింపిక్ గోల్డ్ విజేత అభినవ్ బింద్రా, ఫుట్‌బాల్ లెజెండ్ బైచుంగ్ భుటియా, క్రీడా పారిశ్రామికవేత్త వితా దానీ, SRH అధినేత కావ్యా మారన్, స్పోర్ట్స్ ఎనలిస్ట్స్ రవికాంత్ రెడ్డి, బయ్యాల పాపారావు లాంటివారు ఈ బోర్డ్ లో భాగస్వామ్యులు కావడంతో, ఇలాంటి బోర్డును తొలిగా ఏర్పాటు చేసి, ఘనత సాధించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది. గ్రామీణ క్రీడాకారులకు సముచిత స్థానం ఉండేలా చర్యలు తీసుకోవడం, క్రీడలకోసం కేటాయించిన ప్రతి రూపాయి సరిగ్గా వినియోగించడం,
తెలంగాణలో క్రీడారంగం ఇంటర్నేషనల్ స్థాయిలో వికసించేలా తీర్చిదిద్దడం లాంటివి ధ్యేయంగా పెట్టుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *