మాజీమంత్రి, వైసీపీ లీడర్ అంబటి రాంబాబు ఎప్పటికప్పుడు తన వాయిస్ తో పార్టీకి అండగా నిలుస్తూ ఉంటారు. వైసిపికి అన్నివైపుల నుంచి కేసుల ముళ్ళు గుచ్చుకుంటుంటే అంబటి రాంబాబు ప్రెస్ మీట్ల ద్వారా ఓదార్చే ప్రయత్నాలతో పార్టీ పెద్దలకు తోడుగా మారాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లిక్కర్ స్కామ్ లో సిట్ అధికారులు ఒక్కొక్కటి బయటపెడుతుంటే సీనియర్ లీడర్లంతా మౌనం వహిస్తున్నారు. కానీ, అంబటి రాంబాబు ప్రతి పాయింట్ ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. ప్రతిసారి పార్టీని వెనకేసుకొస్తూ ధైర్యాన్ని ఇస్తున్నారు. అయితే హైదరాబాద్ ఫామ్ హౌస్లో 11 కోట్ల డబ్బు లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడు అయిన రాజ్ కసిరెడ్డిదే అంటూ A40 వరుణ్ పురుషోత్తం చెప్పడం కలకలం రేగింది. ఇదే
కేసులో A34 వెంకటేశ్ నాయుడు డబ్బు లెక్కిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీంతో అంబటి ఆ వీడియోలో 2 వేల నోట్లు ఉన్నాయని, అవి 2023 లో రద్దయ్యాయని, రద్దు చేసిన నోట్లను ఎన్నికల్లో ఎలా ఖర్చు పెడతారని అంబటి లాజిక్కు లేవనెత్తారు. మొత్తానికి ఈ విషయంలో కూడా అంబటి పార్టీకి అండగా ఉండే ప్రయత్నం చేశారు.

