రెడ్ బుక్ మిస్టరీ!

ఏపీ రాజకీయాల్లో ఒకప్పుడు హీట్ పుట్టించిన రెడ్ బుక్ ఇప్పుడు ఎక్కడా వినిపించడం లేదు. యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ ఈ బుక్ ప్రస్తావిస్తూ, తమ పార్టీపై దాడులు చేసిన వైసీపీ నేతలు, అధికారులు పేర్లు రాసుకింటున్నానని, వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరిపై కేసులు నమోదై, అరెస్టులు కూడా జరిగాయి. దీంతో వైసీపీ నేతలు రెడ్ బుక్ రాజ్యాంగమంటూ తీవ్ర విమర్శలు చేశారు.
కానీ ఇప్పుడు రెండు మూడు నెలలుగా ఆ పుస్తకం పేరు టీడీపీ నాయకులు, కార్యకర్తల నోటి నుంచి వినిపించడం లేదు. ప్రజల్లో ప్రతికూల అభిప్రాయం రాకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించిందనే ప్రచారం ఉంది. ఇకపై కక్ష సాధింపు అనే ముద్ర పడకుండా, పరిపాలనపై దృష్టి పెట్టాలని టీడీపీ టాప్ లీడర్లు సూచించినట్లు తెలుస్తోంది.
అందుకే ఒకప్పుడు హడావుడి చేసిన ఎర్ర పుస్తకం ఇప్పుడు సైలెంట్‌గా క్లోజ్ చేసి పెట్టెలో పెట్టారేమో అనిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *