జగన్, కెసిఆర్ అరెస్ట్ అవడం జరగదు

రాజకీయాల్లో లెక్కలు చాలా కీలకం. ఎవరినైనా అరెస్ట్ చేస్తే వారి మీద కేసు కన్నా సానుభూతి ఎక్కువగా వస్తుంది. దేశ రాజకీయ చరిత్రలో జయలలిత, కరుణానిధి, లాలూ ప్రసాద్ యాదవ్, హేమంత్ సోరెన్ లాంటి నేతలు జైలు నుంచి వచ్చి మళ్లీ అధికారంలోకి వచ్చిన ఉదాహరణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా జగన్ జైలు జీవితం వైసీపీని బలంగా నిలబెట్టింది. చంద్రబాబు అరెస్ట్ కూడా కూటమికి భారీ ప్లస్ అయింది. అందుకే ఇప్పుడు జగన్ ని, చంద్రబాబు లేదా కేసీఆర్ ని, రేవంత్ రెడ్డి అరెస్టు చేసే పరిస్థితి లేదని అంటున్నారు.
ఇక ఇప్పుడు కొత్త రకం స్ట్రాటజీ వర్కౌట్ అవుతోంది. నేతలను జైలుకు పంపకుండా, వారిని ప్రజల ముందే అవినీతి, అక్రమాలు చేసినవారిగా చూపించడమే ఆ ప్లాన్. ప్రజల్లో ఈ పార్టీ వస్తే మళ్ళీ అవినీతి పెరుగుతుంది, అరాచక పాలన వస్తుందనే నమ్మకం ప్రజల్లో పెంచేలా ప్రచారం చేస్తున్నారు. దీంతో జైలు సెంటిమెంట్ కాకుండా నేరుగా ఇమేజ్ దెబ్బతినేలా లెక్కలు వేసుకుంటున్నారు రాజకీయ మాస్టర్స్…
మొత్తంమీద, అరెస్టు సెంటిమెంట్ కాకుండా ప్రజా కోర్టులోనే శిక్షించడం అనే కొత్త పొలిటికల్ మేథమెటిక్స్ అమలవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *