రికార్డులన్నీ బద్దలు చేస్తున్న రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సాదాసీదా తీరుతో ప్రజల మనసులు గెలుచుకుంటున్నారు.
కాంగ్రెస్‌లో చాలాకాలం శ్రమించిన నేతలకు దక్కని సీఎం పదవి తక్కువ కాలంలోనే సాధించిన ఆయన, అధికారంలోకి వచ్చాక కూడా సాధారణ వ్యక్తిలాగానే వ్యవహరిస్తున్నారు.
గణేశ్ నిమజ్జన వేళ హెలికాఫ్టర్‌లో రివ్యూ చేయకుండా, సాధారణ కాన్వాయ్‌లో వచ్చి పిల్లలతో చేతులు కలిపి, యువతతో ఫోటోలు దిగారు. నాలుగు దశాబ్దాల తర్వాత ఒక ముఖ్యమంత్రి స్వయంగా నిమజ్జన కార్యక్రమానికి హాజరుకావడం ఇదే తొలిసారి.
అలాగే, ముందస్తు సమాచారం లేకుండానే అమీర్‌పేట ముంపు ప్రాంతాలను పరిశీలించి ప్రజల సమస్యలు విన్నారు. అధికారులకు స్వేచ్ఛ ఇస్తూనే, ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ప్రజల మధ్య ఉండే సీఎంగా రేవంత్ కొత్త స్టైల్ చూపిస్తుండటంతో ఆయనకు ప్రజల్లో మంచి మార్కులు పడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *