అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో భారత్‌పై మరోసారి ఆరోపణలు చేశారు. రష్యా నుండి భారత్ చమురు దిగుమతి చేయడం వల్ల అమెరికా ఉద్యోగాలకు నష్టం జరుగుతోందని, ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా నిధులు అందుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ యుద్ధాన్ని మోదీ యుద్ధమని కూడా అభివర్ణించారు.
అయితే, సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ మాత్రం ఆయన వ్యాఖ్యలను ఫ్యాక్ట్ చెక్ చేసి తప్పుదారి పట్టించే వాదనలుగా కొట్టేసింది. భారత్ తన ఇంధన భద్రత కోసం చమురు కొనుగోలు చేస్తోందని, ఎలాంటి అంతర్జాతీయ ఆంక్షలను ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా, అమెరికా కూడా రష్యా నుండి యురేనియం దిగుమతి చేసుకుంటుందని గుర్తుచేసింది.
నవారో దీనిపై ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫ్యాక్ట్ చెక్‌ను చెత్తగా అన్నారు.. అయితే, భారత పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి, విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆయన ఆరోపణలను ఖండించారు. భారత్ కొనుగోళ్లు G7 నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని స్పష్టం చేశారు. నవారో విమర్శలు నిరాధారమని, భారత్ నిర్ణయం చట్టబద్ధమని ఎక్స్, భారత ప్రభుత్వం కౌంటర్ ఇచ్చాయి.

