ఏపీ లిక్కర్ స్కాంలో కొత్త టర్నింగ్

ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహనరెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు బెయిలు మంజూరు చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేస్తూ హౌస్ మోషన్ పిటిషన్ సిట్ దాఖలు చేసింది. బెయిలు వల్ల ఇన్వెస్టిగేషన్ దెబ్బతింటుందని సిట్ వాదిస్తోంది.
నిందితులు ఆదివారం ఉదయం జైలు నుంచి బయటకు వచ్చినా, విడుదలలో మూడు గంటల ఆలస్యం కావడంతో బంధువులు, వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలు అధికారులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారని ఆరోపణలు వినిపించాయి.
ఇక హైకోర్టులో విచారణ జరగబోతుండటంతో నిందితుల భవిష్యత్తు ఏ దిశగా వెళుతుందో ఉత్కంఠ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *