ఎన్నికల సంఘం అక్రమాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ లీడర్, ఎంపీ రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా మారిందని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం చేస్తున్న అవినీతిపైన.. ఎన్నికల నిర్వహణలో చేస్తున్న అక్రమాలపైనా అణుబాంబును పేలుస్తానని రాహుల్ పదే పదే చెబుతున్నారు. తాజాగా ఆయన ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.. ఎన్నికల సంఘం మహారాష్ట్ర సహా.. ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో వ్యవహరించిన తీరును ఆయన బయట పెట్టారు.
అయితే.. ఈసీపై రాహుల్‌గాంధీ చేస్తున్న తీవ్ర ఆరోపణలకు ఆయనకు మిగిలేది ఏమీ ఉండదని విశ్లేషకులు చెప్తున్నారు. రాహుల్ గాంధీ.. ఏ ఆరోపణ చేసినా EC కనీసం పరిశీలన కూడా చేయట్లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయినప్పటికీ రాహుల్ తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వాస్తవాల పేరుతో కొన్ని విషయాలను ప్రజల ముందుకు తెస్తున్నారు. రాహుల్ తాజాగా ప్రకటించిన… ఎన్నికల జాబితా సహా.. ఇతర అంశాలను పరిశీలిస్తే.. దారుణమైన నిజాలున్నాయని అనిపిస్తోందని కొందరు అంటున్నారు

