ట్రంప్ భారత్‌ని టార్గెట్ చేశారా?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఒక ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో వాణిజ్య సంబంధాల విషయంలో అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ, భారత్‌ మాతో భారీ స్థాయిలో వ్యాపారం చేస్తోంది. కానీ మనం వారికి ఏ మాత్రం ప్రయోజనం కల్పించడం లేదు. అందుకే ఇప్పటికే 25 శాతం duties విధించాం. ఇప్పుడు వాటిని ఇంకా పెంచబోతున్నాం అని చెప్పారు..
ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ లో కూడా ఈ మరింత ఆగ్రహంగా కామెంట్స్ చేశారు. ముఖ్యంగా రష్యా నుంచి భారత్ భారీగా చమురు దిగుమతి చేసుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది పరోక్షంగా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి మద్దతుగా మారుతోందని విమర్శించారు. భారత్ తన వైఖరిని స్పష్టంగా తెలిపింది. చమురు కొనుగోళ్లు దేశీయ అవసరాల మేరకే, అంతర్జాతీయ రాజకీయాల కన్నా భారత ప్రయోజనాలే మాకు ముఖ్యమని వివరణ ఇచ్చింది. అమెరికా కూడా కొన్ని వస్తువులు రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోందని కౌంటర్ వేసింది.
ప్రస్తుతం భారత్, అమెరికా సంబంధాలు స్థిరంగా ఉన్నా, ట్రంప్ కామెంట్స్ ప్రభావం వాణిజ్యంపై పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *