సినిమా రంగంలో వారసత్వం కొన్ని సినిమాల వరకే ఉపయోగపడుతుంది. ఆ తర్వాత టాలెంట్ ముఖ్యం. ఈ నిజాన్ని బాగా అనుభవించిన ఫ్యామిలీ.. మంచు ఫ్యామిలీ. ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన వీళ్ళు, ఈ ఏడాది కాస్త పాజిటివ్ వైబ్ అందుకుంటున్నారు.
మంచు విష్ణు నటించిన కన్నప్ప భారీ లాభాలు రాకపోయినా నష్టాలు మాత్రం ఇవ్వలేదు. భక్తిరస పాత్రలో నటించిన విష్ణు మీద నమ్మకం పెరిగింది. మరోవైపు, తేజ సజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ సినిమాలో విలన్‌గా నటించిన మంచు మనోజ్ కి భారీ స్థాయిలో పేరొచ్చింది. ఇదే సరైన కమ్ బ్యాక్ అని ఫ్యాన్స్ చెబుతున్నారు.
అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలు సద్దుమణిగినట్టు కనిపించగా, విష్ణు కూడా తన తమ్ముడిని అభినందించాడు. ఇక ఈ జోరులో మంచు లక్ష్మీ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఆమె నటించిన దక్ష – ది డెడ్లీ కాన్స్పిరసీ మూవీ సెప్టెంబర్ 19న రిలీజ్ అవుతోంది. ఇందులో మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఈ సినిమా హిట్ అయితే… మంచు ఫ్యామిలీకి ఈ ఏడాది నిజంగానే ఆల్ హ్యాపీ టైమ్ అన్నమాట.

