ఎలన్ మస్క్ సంచలన కామెంట్స్

లండన్‌లో జరిగిన యునైట్ ది కింగ్‌డమ్ ర్యాలీకి ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ వర్చువల్‌గా హాజరై నిరసనకారులకు మద్దతు తెలిపారు. ఈ ర్యాలీలో లక్షకు పైగా ప్రజలు పాల్గొన్నారు.
మస్క్ మాట్లాడుతూ – బ్రిటన్ వలసల కారణంగా నెమ్మదిగా విధ్వంసానికి గురవుతోంది. ఈ పరిస్థితి అలాగే కొనసాగితే హింస తప్పదు. మీకు ఉన్న మార్గం ఒక్కటే… తిరిగి పోరాడండి లేదా చనిపోండి అని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
అలాగే ఆయన బ్రిటన్‌లో ప్రభుత్వ మార్పు అవసరం ఉందని అన్నారు. కీర్ స్టార్మర్ ఆధ్వర్యంలోని లేబర్ ప్రభుత్వం గద్దె దిగి, పార్లమెంట్ రద్దు చేసి కొత్త ఎన్నికలు జరగాలని మస్క్ పిలుపునిచ్చారు.
ఇక అమెరికాలో హత్యకు గురైన ట్రంప్ మద్దతుదారు చార్లీ కిర్క్ గురించి ప్రస్తావిస్తూ వామపక్షాలు హింసకు పాల్పడుతున్నాయి. నా స్నేహితుడిని హత్య చేసి దానిని వేడుక చేసుకున్నారని ఆరోపించారు.
మస్క్ కామెంట్స్ ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *