ఆపరేషన్ సిందూర్ కి ఈ గెలుపు అంకితం

ఆదివారం జరిగిన ఆసియా కప్‌లో భారత్ పాకిస్తాన్‌పై 7 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 127 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగా, సూర్యకుమార్ యాదవ్ 47 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత్ 16వ ఓవర్లోనే మ్యాచ్‌ను ముగించింది.
ఈ మ్యాచ్‌లో ప్రత్యేకంగా గమనించదగ్గ విషయం ఏమిటంటే—భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ చేయలేదు, మాట్లాడలేదు. గెలిచిన వెంటనే సూర్యకుమార్, శివమ్ దూబే నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిపోయారు. సాధారణంగా మ్యాచ్ అనంతరం రెండు జట్లు చేతులు కలుపుతాయి, కానీ భారత ఆటగాళ్లు మైదానంలో తిరిగి రాలేదు.
మ్యాచ్ అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ, పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంఘీభావం తెలియజేయాలనుకున్నాం. ఆపరేషన్ సింధూర్‌లో పాల్గొన్న ఆర్మీ బలగాలకు ధన్యవాదాలు.. అని అన్నారు. ఇదే విషయం కెప్టెన్ కూడా చెప్పడం విశేషం. ఈ విజయం కేవలం క్రీడాపరంగానే కాకుండా దేశభక్తి సందేశాన్ని కూడా ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *