ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలకు కొత్తగా ఫ్యామిలీ కార్డులు ప్రవేశపెడుతోంది. ఇవి ఆధార్ కార్డులా ఉంటాయి. ప్రతి కుటుంబానికి ప్రత్యేక నెంబర్ కేటాయించి, ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాల వివరాలు అందులో ఉంటాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లుగా, ఈ కార్డులో ఒక ఫ్యామిలీ స్కోర్ కూడా ఉంటుంది. ఇది బ్యాంకుల్లో ఉండే సిబిల్ స్కోర్‌లా అన్నమాట. కుటుంబానికి ప్రభుత్వం ఎంత మేలు చేసిందో చూపిస్తుంది. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఫ్యామిలీ కార్డు ఇస్తారు. ఈ విధానం వల్ల ప్రతి కుటుంబ ఆర్థిక స్థితి, అవసరాలు స్పష్టంగా తెలుస్తాయి. దాని ఆధారంగా బీసీ, ఎస్సీ, ఎస్టీతో పాటు అగ్రవర్ణ పేదలకు కూడా సరైన సహాయం అందేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ప్రజలే రాష్ట్ర అభివృద్ధికి మూలమని సీఎం చెబుతూ, భవిష్యత్తులో పాపులేషన్ పాలసీ కూడా తీసుకురావాలని సూచించారు. ఈ కొత్త కార్డుతో కుటుంబాలపై ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులు కూడా అందరికీ తెలుస్తాయని అంటున్నారు..
ప్రతి కుటుంబానికి అవసరమైన సేవలు, పథకాలు సులభంగా చేరేలా ఈ వ్యవస్థ సహకరిస్తుంది.

