RSS చీఫ్ మోహన్ భగవత్ ఢిల్లీలో జరిగిన వంద వర్ష్ కీ సంఘ్ యాత్ర కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువులు ఎక్కువ మంది పిల్లలను కనాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో జనాభా నియంత్రణపై ఎలాంటి చట్టాలు లేవని, హిందూ సమాజం వృద్ధి చెందడానికి ఇది అవసరమని ఆయన తెలిపారు. ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదని, భాషాపరమైన తేడాలు ఉండకూడదని, అలాగే సంస్కృత భాష నేర్చుకోవడం మంచిదని సూచించారు. గతంలో తాను 75 ఏళ్లకే పదవీ విరమణ చేయాలని అన్న వ్యాఖ్యను తప్పుగా అర్థం చేసుకున్నారని, అది మోడీపై చేసిన వ్యాఖ్య కాదని ఆయన స్పష్టం చేశారు. వయసుకు సంబంధం లేకుండా 80 ఏళ్ల వయసులో కూడా పనిచేయడానికి సిద్ధమేనని తెలిపారు. బీజేపీని ఆర్‌ఎస్సెస్ ఎప్పుడూ నియంత్రించదని, సలహాలు మాత్రమే ఇస్తుందని, వాటిని పాటించడం వారి ఇష్టమని చెప్పారు. సంఘ్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ స్వయంసేవకులుగా పనిచేస్తారని, తన తర్వాత పదవికి చాలామంది సిద్ధంగా ఉన్నారని భగవత్ తెలిపారు.

