దళపతి విజయ్ జనంలోకి..!

తమిళ స్టార్ దళపతి విజయ్ ఏర్పాటు చేసిన తమిళగ వెట్రి కళగం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. డీఎంకే–అన్నాడీఎంకే దశాబ్దాలుగా అధికారం చెలాయిస్తున్న వేళ విజయ్ పార్టీ జనంలోకి రావడం పెద్ద చర్చ అయింది.. ఈ నెల 13న తిరుచ్చి నుంచి విజయ్ రాష్ట్ర పర్యటన మొదలు కానుంది. మొత్తం 38 జిల్లాలను రెండు విడతల్లో పర్యటించనున్న విజయ్, భారీ బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తారు. ఈ టూర్లకు భద్రత కల్పించాలని టీవీకే ఇప్పటికే రాష్ట్ర డీజీపీకి లేఖ రాసింది. తమిళనాడు రాజకీయాల్లో ఈసారి పోరు త్రిముఖంగా మారనుంది. అధికార డీఎంకే, ప్రధాన ప్రత్యర్థి అన్నాడీఎంకే మధ్యలో ఇప్పుడు విజయ్ టీవీకే పార్టీ కొత్త శక్తిగా వచ్చింది. అయితే విజయ్ పార్టీకి ఇంకా గ్రాస్‌రూట్ స్థాయి బలగం ఇంకా అవసరం ఉంది. అందుకోసమే ఈ జిల్లాల పర్యటనల్ని కీలకంగా భావిస్తున్నారు. భారీ స్థాయి అభిమానులున్న విజయ్ రాజకీయంగా కూడా విజయాన్ని సాధిస్తారా? లేదా అన్నది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *