జనసేన త్రిశూల్‌ వ్యూహం స్టార్ట్.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల విశాఖలో జరిగిన
సేనతో సేనాని కార్యక్రమంలో ప్రకటించిన త్రిశూల్ పై ఎక్సర్సైజ్ మొదలైంది. పార్టీ భవిష్యత్తు కోసం వచ్చే పది సంవత్సరాలకు ఈ త్రిశూల్‌ వ్యూహం కీలకమని ఆయన స్పష్టం చేశారు.
త్రిశూల్‌ ప్రకారం యువతను మూడు రూపాల్లో తీర్చిదిద్దే పనిని పార్టీ మొదలు పెట్టింది. ఇందుకోసం ఐఐటీ మద్రాస్‌ ఎక్స్‌పర్ట్స్ తో చర్చలు జరుగుతున్నాయి.
సైద్ధాంతిక నిబద్ధత– జనసేన సిద్ధాంతాలు, ప్రజా సమస్యలపై అవగాహన, సేవాతత్వం పెంచే శిక్షణ. నాయకత్వ లక్షణాలు యువతలో ఆత్మవిశ్వాసం కలిగించడం, బలమైన నాయకత్వ గుణాలు పెంపొందించడం.
పార్టీలో కీలక బాధ్యతలు.. శిక్షణ పొందిన వారిని ప్రధాన కార్యదర్శులుగా నియమించి, కీలక బాధ్యతలు అప్పగించడం.
ఈ ప్రణాళిక ద్వారా మెరుపులాంటి యువ నాయకులను తయారు చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి త్రిశూల్‌ కార్యక్రమానికి పూర్తి రూపం రానుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *