కొడాలి నానికి ఉత్తరాంధ్ర దెబ్బ

కూటమి ప్రభుత్వం వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నానిపై కన్నేసింది. వైసిపి ఓడిన వెంటనే మొదటగా అరెస్టయ్యేది కొడాలి నాని అని ప్రచారం జరిగినా, ఇప్పటిదాకా అరెస్ట్ కాలేదు.
కొడాలి నాని మంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు, లోకేష్ లపై బూతులతో విరుచుకుపడేవాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొడాలి నాని ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. కొడాలి చాలాకాలం అజ్ఞాతంలోకి వెళ్ళారు. తరువాత అనారోగ్యంతో హైద్రాబాద్, ముంబైలలో ట్రీట్మెంట్ తీసుకొని గుడివాడకు రాకుండా హైద్రాబాద్ లోనే ఉంటున్నారు. నియోజకవర్గానికి ఒకటి రెండుసార్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పడు కేసుల చిట్టా బయటికి తీస్తున్నారు. నానిపై సంవత్సరం క్రితమే రెండు కేసులు పెట్టగా ముందస్తు బెయిల్ తీసుకున్నారు. ఇప్పుడు పలు కేసుల లిస్టు బయటికి తీస్తున్నారు. విశాఖ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో అంజనా ప్రియ వేసిన కేసులో అరెస్టయ్యే పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు గుడివాడలో నాని ఇంటికి వెళ్ళి 41 నోటీసులు ఇచ్చారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలకు మనస్తాపం చెంది ఈ కేసువేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *